ఉమ్మడిగానే జీవిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడిగానే జీవిద్దాం

Jul 11 2025 5:43 AM | Updated on Jul 11 2025 5:43 AM

ఉమ్మడ

ఉమ్మడిగానే జీవిద్దాం

సమష్టి కుటుంబాలకు పునర్వైభవం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఉమ్మడి కుటుంబాల్లో భావోద్వేగాలకు, ఆప్యాయతలకు చోటుంటుంది. అలాంటి కుటుంబ వ్యవస్థలో గత మూడు దశాబ్దాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటూ వ చ్చాయి. గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ దాదాపుగా కనుమరుగయ్యే దశకు చేరుకుంది. అక్కడక్కడా వేళ్లమీద లెక్కించే స్థాయిలో మాత్రమే ఉమ్మడి కుటుంబాలు నడుస్తున్నాయి. అయితే, కోవిడ్‌ తర్వాత మాత్రం కొంతమేర మార్పు వస్తోంది. కొందరు మళ్లీ ఉమ్మడి కుటుంబాల వైపు ఆసక్తి చూపుతున్నారు. కానీ, ఆచరణలో మాత్రం అనుకున్నవిధంగా అడుగులు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. మారిన జీవన విధానం, ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన తప్పని పరిస్థితుల్లో చిన్నచిన్న కుటుంబాలుగానే నివసించక తప్పని పరిస్థితి నెలకొందని అత్యధిక మంది చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబంతోపాటు సంతానం ఎక్కువగా ఉంటే బంధాలు మరింత బలపడతాయని చెబుతున్నప్పటికీ, మారిన జీవన విధానం, ఖర్చుల పెరుగుదలతో ఒకరిద్దరు సంతానాన్ని మాత్రమే కంటామని యువ జంటలు చెబుతున్నాయి. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అందులో భాగంగా నిర్వహించిన సర్వేలో పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేశారు.

● జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 25,51,335 మంది ఉన్నారు. జనాభా పెరుగుదల 2001లో 15.2 శాతం, 2011లో 8.7 శాతంగా నమోదైంది. జననాల రేటు 2024 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి 31 వరకు 10,988 మంది బాలురు జన్మించగా, బాలికలు 9,932 మంది జన్మించారు. 904 మంది తేడా ఉంది.

జిల్లాలో 25 ఏళ్లకు పైబడి వివాహ ప్రయత్నాలలో ఉన్న వారి అభిప్రాయాలు

ఉమ్మడి కుటుంబం మంచిదా..

చిన్న కుటుంబం కోరుకుంటున్నారా?

అ) ఉమ్మడి కుటుంబమే మంచిది: 55 ఆ) చిన్న కుటుంబమే బాగుంటుంది: 20

కొవిడ్‌ తర్వాత మారుతున్న దృక్పథం

బంధాలు బలహీనం కాకుండా

ఉండాలంటున్న పలువురు

సంతానం విషయంలోనే

భిన్నాభిప్రాయాలు

ప్రస్తుత జీవన ప్రమాణాల నేపథ్యంలో

ఒకరిద్దరికే పరిమితమంటున్న అధికులు

జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న

కొన్ని ఉమ్మడి కుటుంబాలు

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

ఎంత మంది సంతానాన్ని

కనాలనుకుంటున్నారు?

అ) ఒకరు లేదా ఇద్దరు: 60

ఆ) ముగ్గురు పిల్లలు: 15

ఇద్దరికంటే ఎక్కువ సంతానంతో ప్రయోజనం ఉంటుందా.. ఉండదా?

అ) ఉంటుంది: 58 ఆ) ఉండదు: 17

ప్రస్తుతం తోబుట్టువుల మధ్య

అనుబంధం ఎలా ఉంది?

అ) అంతంత మాత్రమే: 41

ఆ) బాగానే ఉంది: 10

ఇ) డబ్బుకు, ఆస్తులకు ప్రాధాన్యం: 24

ఉమ్మడిగానే జీవిద్దాం1
1/1

ఉమ్మడిగానే జీవిద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement