
నిజామాబాద్
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025
ఆర్మూర్‌లోని మామిడిపల్లికి చెందిన రామయ్యగారి నర్సింహులు కుటుంబం ఇప్పటికీ ఉమ్మడిగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తోంది. నర్సింహులు లేకపోయినప్పటికీ వారి నలుగురు కుమారులు, వారి వారి సంతానం కలిసి జీవిస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు పెద్దమనుషులు, పది జంటలు, 25 మంది పిల్లలతో కలుపుకొని మొత్తం 50 మంది ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. వ్యవసాయ కుటుంబం కావడంతో పెద్దలంతా పొలాల్లో పనిచేస్తారు. సాయంత్రం ఇంటికి చేరుకొని కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. రెండు నెలల క్రితం సన్నరకం బియ్యం పథకం పరిశీలనకు వచ్చిన ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. నేటితరానికి నర్సింహులు కుటుంబం ఆదర్శమని కొనియాడారు.
న్యూస్‌రీల్
కలిసి ఉంటే
కలదు సుఖం

నిజామాబాద్