
ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల సంఖ్య పెంచాలి
నిజామాబాద్‌అర్బన్: ఇంటర్ విద్యలో అడ్మిషన్‌ల సంఖ్య పెంచాలని, అలాగే ఉత్తీర్ణత శాతం పెరిగేలా చూడాలని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఒడ్డెన్న సూచించారు. నగరంలోని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గురు వారం డీఐఈవో తిరుమలపుడి రవికుమార్ అధ్యక్ష తన జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఒడ్డెన్న మాట్లాడుతూ.. పదో తరగతిలో పాసైన విద్యార్థులు ఇప్పటికీ ఏ కళాశాలలోనూ చేరకపోతే వారిని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరేలా కృషి చేయాలన్నారు. ప్రిన్సిపాల్స్ తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను సందర్శించి, ఎస్సెస్సీ పూర్తయిన విద్యార్థులు ఎక్కడ చేరారో వి వరాలు సేకరించాలన్నారు. అడ్మిషన్‌ల డేటా మొ త్తం ఆన్‌లైన్లలో ఎప్పటికప్పుడు నమోదు చేయాల న్నారు. త్వరలో నిర్వహించబోయే పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇంటర్ బోర్డు మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకొని పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు ప్రిన్సిపాల్స్ కళాశాలల్లోని సమస్యలను తెలిపారు. అంతకుముందు ఒడ్డెన్న కోటగిరి, వర్ని, నిజామాబాద్ బాలుర ఖిల్లా జూనియర్ కళాశాలల్లో సమావేశాలు నిర్వహించారు.