
భోజన ఏజెన్సీలకు బకాయిల భారం
మోర్తాడ్(బాల్కొండ): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల కడుపు నింపుతున్న మధ్యా హ్న భోజన ఏజెన్సీలు ఆర్థిక ఇబ్బందులను ఎదు ర్కొంటున్నాయి. ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బకాయిలు పేరుకపోవడంతో ఇంకెంత వరకు అప్పులు చేయాలని ప్రశ్నిస్తు న్నారు. గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు డైట్ చార్జీలను పెంచిన ప్రభుత్వం వారికి క్రమం తప్పకుండా నిధులను కేటాయిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఏజెన్సీలకు మాత్రం నెలల తరబడి బిల్లులను చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 20 24–25 విద్యా సంవత్సరానికి అక్టోబర్ నుంచి ఫిబ్ర వరి 2025 వరకూ తొమ్మిది, పది తరగతులు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన బిల్లులతోపా టు అన్ని తరగతుల విద్యార్థులకు కోడిగుడ్లు వడ్డించిన బిల్లులు, గౌరవ వేతనం బకాయిలు రూ.1.43 కోట్ల వరకూ ఉన్నాయి. గడిచిన మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి రూ.3 కోట్లు, 2025–26 విద్యా సంవత్సరంలోని బిల్లు బకాయి మరో రూ.1.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని 1124 ఏజెన్సీలకు ప్రతి నెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లించాలంటే రూ.1.50 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఏజెన్సీల నిర్వాహకులు పేద, మధ్య తరగతికి చెందినవారే కావడంతో వి ద్యార్థులకు భోజనం పెట్టాలంటే అప్పులు చేయా ల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడం, దుకాణాదారుల వ ద్ద తీసుకున్న సామగ్రి డబ్బులు చెల్లించకపోవడంతో కొత్తగా ఉద్దెర ఇవ్వమని ఘాటుగా సమాధానం చెబుతున్నారని బాధపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.
బిల్లుల చెల్లింపులలో సర్కారు నిర్లక్ష్యం
జిల్లాలో దాదాపు రూ.5.93 కోట్లు
పెండింగ్
బకాయిలు చెల్లించాలి
మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లు బకాయిలు వెంటనే చెల్లించాలి. ఏజెన్సీలు ఎన్నో కష్టాలు పడుతున్నాయి. బిల్లులు చెల్లించకపోతే ఏజెన్సీల నిర్వాహకులతో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తాం.
– చక్రపాణి, సీఐటీయూ నాయకుడు