
ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వ చేయూత
బోధన్‌టౌన్(బోధన్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షలతోపాటు ఇసుకను ఉచితంగా అంది స్తూ లబ్ధిదారులకు ప్రభుత్వం చేయూతనిస్తుందని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు డ్వాక్రా రుణాలు ఇప్పించి, ఇళ్లు నిర్మించుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. మంగళవారం బోధన్ మున్సిపల్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి బల్దియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై సాధించిన ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, చిత్తశుద్ధితో పనిచేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఫ్రైడే డ్రైడే నిర్వహించాలన్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన ప్రొసీడింగ్స్ అందించాలని సూచించారు. అనంతరం పాండుఫారంలో ఇందిర మ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. జిల్లా మలే రియా నియంత్రణ విభాగం అధికారి తుకారాం రాథోడ్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, బల్ది యా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మాణానికి డ్వాక్రా రుణాలు
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి