పకడ్బందీగా స్నాతకోత్సవ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా స్నాతకోత్సవ ఏర్పాట్లు

Jul 9 2025 6:30 AM | Updated on Jul 9 2025 6:30 AM

పకడ్బందీగా స్నాతకోత్సవ ఏర్పాట్లు

పకడ్బందీగా స్నాతకోత్సవ ఏర్పాట్లు

తెయూ వీసీ యాదగిరిరావు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 16న జరిగే రెండో స్నాతకోత్సవానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలని వీసీ ప్రొఫెసర్‌ టీ యాదగిరిరావు స్పష్టం చేశారు. 12 సంవత్సరాల తర్వాత రెండో స్నాతకోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన స్నాతకోత్సవ కమిటీ కన్వీనర్ల సమావేశంలో ఆయ న మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో ఏర్పాట్లు బాగుండాలన్నారు. స్నాతకోత్సవానికి హాజరయ్యే విద్యార్థులు, పరిశోధకులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వసతులు కల్పించాలన్నారు. 2014 నుంచి 2023 వరకు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో వివిధ విభాగాల నుంచి మొదటి ర్యాంకు పొందిన 180 మంది విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌తోపాటు 30 జూన్‌ 2025 వరకు వివిధ విభాగాలలో పరిశోధనలు పూర్తి చేసుకున్న సుమారు 158 మంది పరిశోధకులకు డాక్టరేట్‌ పట్టాలను రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అందజేస్తారని వీసీ తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ ఎంయాదగిరి, కంట్రోలర్‌ సంపత్‌ కుమార్‌, కమిటీ కన్వీనర్లు ఘంటా చంద్రశేఖర్‌, కనకయ్య, అపర్ణ, ఆరతి, రాంబాబు, ఆంజనేయులు, రవీందర్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ మామిడాల ప్రవీణ్‌, నాగరాజు, పీఆర్వో పున్నయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement