ప్రభుత్వం వద్ద మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం వద్ద మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌

Jul 9 2025 6:29 AM | Updated on Jul 9 2025 6:29 AM

ప్రభు

ప్రభుత్వం వద్ద మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌

● ఆక్రమణలను బల్దియా అధికారులే ప్రోత్సహిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా స్పందించడం లేదు. మాస్టర్‌ ప్లాన్‌ ఖచ్చితంగా అమలు చేయాలి. ఖలీల్‌వాడి, బోధన్‌ రోడ్డు, హైదరాబాద్‌ రోడ్‌లలో ఆక్రమణలను తొలగించాలి. పాతనగరంలో పార్కులు లేవు. హైదరాబాద్‌ రోడ్డులో ఇటీవల విచ్చలవిడిగా బహుళ అంతస్థుల భవనాలకు అనుమతులు ఇస్తున్నారు. ఇందులో టౌన్‌ప్లానింగ్‌ అధికారుల సహకారం కూడా ఉంది. సయ్యద్‌ ఖైసర్‌ (పులాంగ్‌), కోర్వ దేవేందర్‌ (ఎల్లమ్మగుట్ట), శివాజీ భూషణ్‌ (శ్రీనగర్‌ కాలనీ), గంగాధర్‌ (వర్ని చౌరస్తా)

● మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ పూర్తిచేసి ప్రభుత్వానికి పంపించాం. ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతి ఇవ్వాలి. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించబోము. ట్రాఫిక్‌ ఫ్రీగా సిటీగా మార్చాలన్నదే మా లక్ష్యం. నగరవాసులు సహకరించాలి. నిబంధనలను పాటించని నిర్మాణాలకు అనుమతులు ఇవ్వం.

అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేది లేదు

ట్రాఫిక్‌ ఫ్రీ సిటీగా మార్చాలన్నదే లక్ష్యం

నగరవాసులు సహకరించాలి

కుక్కల బెడదను నివారిస్తాం

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో మున్సిపల్‌

కార్పొరేషన్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌

● వినాయక్‌నగర్‌లోని అమ్మ వెంచర్‌ పరిసరాలు అధ్వానంగా మారాయి. దారివెంట పిచ్చి మొక్కలు పెరిగాయి. చెత్త సేకరించడం లేదు. రోడ్ల మరమ్మతులు చేపట్టడం లేదు. వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. మధుసూదన్‌ (అమ్మ వెంచర్‌),

వేణుకుమార్‌(ఎల్లమ్మగుట్ట)

మున్సిపల్‌ కమిషనర్‌: వీధిలైట్ల మెయింటెనెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏజెన్సీకి అప్పగించింది. త్వరలోనే లైట్లు ఏర్పాటు చేస్తాం. చెత్త సేకరణ రోజూ జరిగేలా సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశిస్తాం.

● నగరంలోని నాల్గో డివిజన్‌ పరిధిలో ఉన్న పాంగ్రా, మాధవనగర్‌, మూడో డివిజన్‌లోని గూపన్‌పల్లి, గంగాస్థాన్‌–2, వీరభద్రకాలనీల్లో పారిశుద్ధ్య సిబ్బంది డ్రెయినేజీలు తీయడం లేదు. ఖానాపూర్‌ భాగ్యనగర్‌ కాలనీలో ఇళ్ల మధ్య మురికినీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తుస్తోంది. పారిశుద్ధ్య కార్మికులు సరిగా చెత్త తీసుకెళ్లడంలేదు. డీఎస్‌ మార్కెట్‌ ఎదురుగా ఉన్న గల్లీలు అధ్వానంగా మారాయి.

సాలుగారి మోహన్‌ (ఖానాపూర్‌), రాములు (పాంగ్రా), రతన్‌ (47 డివిజన్‌), నాగభూషణం (ఆర్టీసీ కాలనీ)

● ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తాం. వెంటనే శానిటరీ ఇన్‌పెక్టర్లు సునీల్‌, షాదుల్లాతోపాటు శానిటరీ సూపర్‌ వైజర్‌ సాజిద్‌ అలీతో మాట్లాడుతా. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తా.

● యాదగిరిబాగ్‌లో ప్రభుత్వ స్థలం కబ్జాచేస్తున్నారని పలుమార్లు అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. కబ్జాదారులను ప్రోత్సహించొద్దు.. ప్రభుత్వ స్థలాలను కాపాడాలి. తాగునీటి సమస్యను పరిష్కరించాలి. భూమేశ్వర్‌ గుడ్ల (యాదగిరిబాగ్‌), శ్రీనివాస్‌గౌడ్‌ (వినాయక్‌నగర్‌)

● మున్సిపల్‌ రోడ్డు కబ్జాపై ఫిర్యాదు అందింది. టౌన్‌ప్లానింగ్‌ అధికారులను పంపించి పనులు నిలిపివేయించాం. తిరిగి పనులు చేస్తే ఈసారి కేసు నమోదు చేస్తాం. అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ శ్రీనివాస్‌కు ఆదేశాలు జారీచేస్తాం.

● కాలూర్‌ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఓ నాయకుడు కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నాడు. దీనిపై ఫిర్యాదు చేసినా ఖాతరు చేయడం లేదు. కఠిన చర్యలు తీసుకోవాలి. గంగాధర్‌ (కాలూర్‌), శ్రీనివాసులు (కాలూర్‌)

● వెంటనే పనులు నిలిపివేయిస్తాం. టౌన్‌ప్లానింగ్‌ అధికారులను పంపిస్తాం. మళ్లీ పనులు చేపడితే సమాచారం ఇవ్వండి. ఈ సారి నేనే వచ్చి చూస్తా.

● ఇంటింటికి చెత్త బండి రోజూ రావడం లేదు. డ్రెయినేజీలు శుభ్రం చేయడం లేదు. తీసిన చెత్తను తరలించడం లేదు. కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి.

మహేశ్‌ (మమ్మదేవీ కాలనీ), అబ్దుల్‌నయీం ఖాన్‌ (ఖిల్లా చౌరస్తా), రాజులదేవి శంకర్‌ (గాజుల్‌పేట్‌), రజిని (ఆనంద్‌నగర్‌కాలనీ), గులాబ్‌ సింగ్‌ (ఫారెస్ట్‌ ఆఫీస్‌ వెనక ప్రాంతం), మోహన్‌ (పవర్‌హౌస్‌)

● ఇంటింటి చెత్త సేకరణ రోజూ జరగాల్సిందే. డ్రెయినేజీల్లో నుంచి తీసిన చెత్తను కూడా తొలగిస్తారు. ఈ మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్లను ఆదేశిస్తా. కుక్కలను పట్టే కార్యక్రమం కూడా పూర్తిస్థాయిలో చేపడతాం.

నిజామాబాద్‌ సిటీ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేది లేదని, నిబంధనలను పాటించని నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ స్పష్టం చేశా రు. నగరంలో తాగునీరు, డ్రెయి నేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహ ణ, భవన నిర్మాణ అనుమతులు తదితర సమస్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం ‘ఫోన్‌ ఇన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించగా.. కమిషనర్‌ పాల్గొన్నారు. ఉదయం 10.30 నుంచి 11.30గంటల వరకు సుమారు 52 మంది నగరవాసులు ఫోన్‌ చేసి వివిధ సమస్యలను కమిషనర్‌కు వివరించారు. అవసరమైన చోట్ల వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తామని, ప్రతిరోజూ చెత్త సేకరణ ఉంటుందని, కుక్కల బెడదను నివారిస్తామని కమిషనర్‌ అన్నారు. ‘ఫోన్‌ ఇన్‌’ కొనసాగిందిలా..

● వినాయక్‌నగర్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ వద్ద రోడ్డు పనులు నెలలుగా సాగుతున్నాయి. కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. బోసుబాబు (వినాయక్‌నగర్‌), సాయిబాబు (కెనాల్‌ కట్ట)

● సంబంధిత ఏఈని పంపి పనులు వేగవంతం చేయాలని ఆదేశిస్తాం. కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. కుక్కలు పట్టేవారిని ఈ రాత్రి పంపిస్తాం.

కోటగల్లిలోని సరస్వతి శిశుమందిర్‌ వెనుకభాగంలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ఖాళీ స్థలంలో మురికి నీరు నిలుస్తోంది. పాములు, తేళ్లు, విషపురుగులు పాఠశాలలోని తరగతి గదుల్లోకి వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎన్నిసార్లు శానిటరీ జవాన్‌లకు, ఎస్సై సునీల్‌కు చెప్పినా మా పరిధి కాదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు.

డాక్టర్‌ శ్రీనివాస్‌ (కోటగల్లి), గోపినాథ్‌ (గోల్‌హనుమాన్‌),

మాయావర్‌ సావిత్రి (కోటగల్లి)

పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిందే. వెంటనే స్పెషల్‌ టీమ్‌తో శుభ్రం చేయిస్తా. సంబంధిత ఎస్సై, శానిటరీ సూపర్‌వైజర్‌ను పంపిస్తాం.

ప్రభుత్వం వద్ద మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌1
1/3

ప్రభుత్వం వద్ద మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌

ప్రభుత్వం వద్ద మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌2
2/3

ప్రభుత్వం వద్ద మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌

ప్రభుత్వం వద్ద మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌3
3/3

ప్రభుత్వం వద్ద మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement