
బలగాలు గైడ్ చేస్తున్నాయి
అమర్‌నాథ్ యాత్రలో భారత సైనికులు చక్కగా గైడ్ చేస్తున్నారు. మర్యాద పూర్వకంగా, స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఇబ్బందులేమైనా ఉంటే అడుగుతున్నారు. కశ్మీర్‌లో చాలా చోట్ల రోడ్లు, వంతెనల నిర్మాణాలు తుది దశకు వచ్చాయి. టన్నెల్స్ సైతం ప్రారంభమయ్యాయి. తెలుగు వారు చాలామంది ఉన్నారు. మేము పదిమంది బృందంగా నిజామాబాద్ నుంచి వెళ్లాం. శ్రీనగర్‌లో దాల్ సరస్సు చాలా బాగుంది. వంతెనలు, రోడ్లు పూర్తి అయితే మరింత తక్కువ సమయంలో యాత్ర పూర్తి చేయొచ్చు.
వడ్డి జనార్దన్ రెడ్డి, వరలక్ష్మి, నవీపేట