
ఓటర్ నమోదుపై బీఎల్వోలకు అవగాహన
ఇందల్వాయి : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ నమోదు కార్యక్రమంపై బూత్ లెవెల్ ఆఫీసర్లకు సోమవారం ఆర్డీవో రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు పొందేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు బీఎల్వోలు కృషి చేయాలని సూచించారు. ఓటు హక్కు పొందేందుకు అవసరమైన ధృవపత్రాల వివరాలను వారికి తెలియజేయాలన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా జాగ్రత్త పడాలని అధికారులకు సూచించారు. మార్పులు చేర్పులు సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట్రావు, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, ఆర్‌ఐ మోహన్ తదితరులు పాల్గొన్నారు.