
అడ్డేముంది.. ఆక్రమించేద్దాం!
సోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2025
– 8లో u
13న ఊర పండుగ
నిజామాబాద్‌రూరల్: నగరంలో ఈ నెల 13న ఆదివారం ఊర పండుగ నిర్వహించనున్నట్లు సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివా రం సిర్నాపల్లిగడిలో పండుగ సన్నాహక స మావేశం నిర్వహించారు. నగరంలోని ఖిల్లా చౌరస్తా నుంచి పెద్దబజార్, ఆర్య సమాజ్, గోల్ హనుమాన్ ఆలయం మీదుగా వినా యక్‌నగర్ వరకు గ్రామదేవతల ఊరేగింపు ఉంటుందన్నారు. మరో గ్రామ దేవత దుబ్బ వైపు వెళ్తుందని పేర్కొన్నారు. గురువారం బండారు వేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సర్వ సమాజ్ కమిటీ ప్రతినిధులు బంటు రాము, ఆదె ప్రవీణ్, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మాలల సంక్షేమానికి
కృషి చేయాలి
నిజామాబాద్ నాగారం : జిల్లాలోని మాలల సంక్షేమానికి కృషి చేయాలని, ఏ కష్టం వచ్చి నా అండగా ఉండాలని మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులకు మాజీ ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సూచించారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో ఉన్న సంఘం కార్యాలయంలో ఆ దివారం నిర్వహించిన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన జిల్లా కమిటీ తో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు అలుక కిషన్, జిల్లా అధ్యక్షుడు స్వామిదాస్, ప్రధాన కార్యదర్శి చొక్కం దేవదాస్, తదితరులు పాల్గొన్నారు
పేలుడు పదార్థాల కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్
కామారెడ్డి క్రైం: అక్రమంగా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన కేసులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశా రు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో ఇంటి నిర్మాణం కోసం బండరాళ్లు పగుల గొట్టడానికి యజమాని శ్రీధర్ పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నాడు. వారంతా కలిసి ఈనెల 4న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రితో బండరాళ్లు పేల్చడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చుట్టుపక్కల వారు ఫిర్యాదు చే యడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. లింగాపూర్ వద్దనున్న శ్రీవారి వెంచర్‌లో నిల్వ చేసిన 1,564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకు న్నారు. పేలుడు పదార్థాలు నిల్వ చేసిన గది మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ భర్త, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, అతడి సోదరుడు గడ్డం సురేందర్‌రెడ్డిలది. శనివారం అర్ధరాత్రి చంద్రశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తరలించారు. సురేందర్‌రెడ్డి పరారీలో ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరం మధ్యలో నుంచి ప్రవహించే పులాంగ్‌వాగు కబ్జా అవుతుండడంతో వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రెండు గంటలపాటు భారీ వర్షం కురిస్తే ఇందూరు నగరంలోని ప్రధాన రోడ్లన్నీ నీటితో నిండుతున్నాయి. నగరం నుంచి మురుగునీటితోపాటు వర్షపు నీరు వెళ్లిపోవడంలో పులాంగ్ వాగుది ప్రధాన పాత్ర. అయితే వాగును కొందరు అక్రమార్కులు అడుగడుగునా కబ్జా చేయడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పిల్లకాలువలా తయారైంది. ఇంత జరిగినా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ, అటవీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. న్యాల్‌కల్ చెరువు అలుగుతో మొదలయ్యే ఈ పులాంగ్ వాగు నవీపేట మండలం నాళేశ్వర్ వద్ద గోదావరిలో కలుస్తుంది. గాయత్రినగర్, పద్మనగర్, ప్రగతినగర్, ఎల్లమ్మగుట్ట, కంఠేశ్వర్, గూపన్‌పల్లి వరకు వాగు కుంచించుకుపోయింది. ప్రగతినగర్, ఎల్లమ్మగుట్ట ప్రాంతాల్లో వాగును ఆక్రమించి భారీ భవనాలను నిర్మించారు. ఇక కొందరు ప్రబుద్ధులు కంఠేశ్వర్, గూపన్‌పల్లి ఏరియాల్లో పులాంగ్‌లో వేలకొద్దీ ట్రక్కుల మట్టి నింపి వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మేశారు. పులాంగ్ వాగుకు ఇరువైపులా జాతీయ పక్షులైన నెమళ్లు ఉన్నాయి. అయితే ఆక్రమణలు, భారీ నిర్మాణాల కారణంగా అందమైన నెమళ్లకు నిలువనీడ లేకుండా పోతోంది. త్వరలోనే ఇక్కడి నుంచి నెమళ్లు మాయమయ్యే పరిస్థితి ఉంది. ఇక పాంగ్రా వాగు సైతం ఆక్రమణలకు గురైంది. ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో వాగును ఆక్రమించిన ఓ ప్రముఖ బిల్డర్.. వాగు స్థలంలో మట్టిపోసి చదును చేసి తాను నిర్మించి అమ్మేసిన అపార్ట్‌మెంట్లకు సంబంధించిన క్లబ్ హౌస్‌ను నిర్మించడం గమనార్హం.
ఆనవాళ్లు కోల్పోయిన నిజాంసాగర్ కాలువ
మాలపల్లి, అహ్మద్‌పురా కాలనీ, నటరాజ్ థియేటర్ వెనుక నుంచి మిర్చి కాంపౌండ్ వైపు డి–54 కాలువను పూర్తిగా ఆక్రమించి ఇళ్లు, భారీ భవనాలు నిర్మించారు. దీంతో కాలువ ఆనవాళ్లు లేకుండా పోయింది. ఇతర ప్రాంతాల్లో సైతం కాలువలో పూడిక తీయలేని దుస్థితి నెలకొంది.
● నగరంలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్‌ను వివరణ కోరగా.. వాగులు, చెరువుల కబ్జాలు, ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారులకు చెబుతామన్నారు. ఇరిగేషన్ డిప్యూటీ సీఈ ప్రవీణ్‌ను వివరణ కోరగా త్వరలో వీటిపై సర్వే చేయిస్తామన్నారు.
వరద.. ట్రాఫిక్
నగరంలో ఓ వైపు వాగులు, కాలువలు కబ్జా అవుతుండగా.. మరో వైపు అనుమతులకు సంబంధం లేకుండా భారీ నిర్మాణాలు చేపడుతుండడంతో వర్షాకాలంలో పరిస్థితి అధ్వానంగా మారుతోంది. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఐదడుగుల మేర నీళ్లు నిలుస్తున్నాయి. వరద నీటి కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. 30 మీటర్ల దూరం వెళ్లేందుకు 30 నిమిషాల సమయం పట్టిన పరిస్థితి అనేకసార్లు ఉత్పన్నమైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు, సెట్‌బ్యాక్, ఫైర్ అనుమతులు లేకుండానే భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టారు. వీటి విషయంలో అధికార యంత్రాంగం తమకేం సంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తోంది. పార్కింగ్ విషయంలో పోలీసు శాఖ వాహనదారులకు జరిమానాలు వేస్తుండగా, భవనాల ఫైర్, సెల్లార్, సెట్‌బ్యాక్ విషయమై ఆయా శాఖల మధ్య ఏనాడూ సమన్వయ సమావేశం జరిగిన దాఖలాలు లేవు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో ప్రధాన నగరం స్లమ్ సిటీగా మరే పరిస్థితి ఉందని ఇందూరువాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో
బాల్కొండ: స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 6,090 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 323 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు)అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 1067 (18.8 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది.
న్యూస్‌రీల్
32 ఎకరాల రామర్తి.. 6 ఎకరాలైంది!
బోధన్ రోడ్‌లోని రామర్తి చెరువు విస్తీర్ణం 32 ఎకరాలు కాగా ప్రస్తుతం కేవలం 6 ఎకరాల లోపు మాత్రమే మిగిలింది. దీనిపై 2024 మార్చి నెలలో ‘సాక్షి’లో కథనాలు వెలువడగా.. అధికారులు మూడురోజులపాటు కూ ల్చివేతల ప్రక్రియ చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. రామర్తి చెరువు అభివృద్ధి కోసం గతంలో దివంగత సీఎం, మహానేత రాజశేఖర్‌రెడ్డి వేసి న పైలాన్‌ను సైతం కబ్జాదారులు మాయం చేశారు. జిల్లాలోనూ ‘హైడ్రా’ మాదిరి ‘నిడ్రా’ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
కార్పొరేషన్ కహానీ – 6
బ్రహ్మ చెరువులో 12 ఎకరాలు మాయం
స్లాటర్ హౌస్ వెనుక ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న సహజసిద్ధమైన బ్రహ్మచెరువును సైతం క బ్జా చేశారు. కొందరు ప్రబుద్ధులు ఏకంగా చెరువు కు సంబంధించి 12 ఎకరాల భూమిని మింగేశా రు. పూర్తిగా చదును చేసి ప్లాట్లు చేశారు. పక్క నే ఉన్న అటవీ భూమిలో సైతం ఓ కీలక ప్రజాప్రతినిధి అక్రమంగా వెంచర్ వేశాడు. అటవీ సరిహ ద్దు దిమ్మె వద్దనే వెంచర్ సరిహద్దు రాయి పాతా రు. ఇక్కడికి వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో స్లా టర్ హౌస్ వెనుక ఉన్న గోడను కూల్చి రో డ్డు వే శారు. బ్రహ్మ చెరువుకు సమీపంలోని బాబన్‌సాహెబ్ పహాడ్ వద్ద డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణా ల సమీపంలో 2230, 2231, 2232, 2233, 22 22, 2237 సర్వే నంబర్లలో అనధికారికంగా, అక్రమంగా లేఅవుట్‌లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. వీటిలోనూ కొందరు ప్రజాప్రతినిధులది కీలక పాత్ర కావడం గమనార్హం. మరోవైపు నగరంలో కీలకమైన బొడ్డెమ్మ చెరువు వద్ద 28 ఎకరాల శి ఖం భూమిని ఆక్రమించి నిర్మాణా లు చేపట్టారు. ఇలా ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ భూములు విచ్చలవిడిగా ఆక్రమణలకు గురవుతున్నాయి.
పులాంగ్ వాగు, నిజాంసాగర్
కాలువల కబ్జా
రామర్తి, బ్రహ్మ చెరువుల
ఆనవాళ్లు మాయం
భారీ వర్షం కురిస్తే నగరంలో
అంతా ఆగమాగం
వరద నీరు ప్రవహించే అవకాశం
లేకుండా అక్రమ నిర్మాణాలు
నాలాలనూ వదలని వైనం
మున్సిపల్ అధికారుల
అనుమతులపై అనుమానాలు
పులాంగ్‌వాగును కాపాడాలి
పులాంగ్ వాగును శు భ్రం చేయాలి. వాగు లోతును పెంచడంతో పాటు చెత్తవేయకుండా రెండు వైపులా కంచె ఏ ర్పాటుచేయాలి. ఇరిగేషన్ అధికారులు వాగు విస్తీర్ణాన్ని కొలిచి బౌండరీలను గుర్తించి ఆక్రమణలను తొలగించాలి. వరదల నుంచి నగరాన్ని కాపాడాలి.
– ఆకుల పాపయ్య, రైతు నాయకుడు
నిడ్రా తీసుకురావాలి
విశాలమైన పులాంగ్ వాగు క్ర మంగా పిల్ల కాల్వలను తలపిస్తోంది. వాగు వాస్తవ విస్తీర్ణం కొ లిచి, హద్దులు నిర్దేశించాలి. ఈ అంశంపై మున్సిపల్ కౌన్సిల్‌లో కూడా చర్చించాం. రామర్తి చెరువు కబ్జాలు తొలగించేందుకు రూ.20 లక్షలు కేటాయించాం. పేదలకు ఇబ్బంది కలకుండా నిజామాబాద్‌లో నిడ్రా తీసుకురావాలి.
– న్యాలం రాజు, బీజేపీ నాయకుడు, ఎల్లమ్మగుట్ట
ఆక్రమణలను తొలగించాలి
పులాంగ్ వాగు, నిజాంసాగర్ కెనాల్‌ను రియల్ ఎస్టేట్ వ్యాపారులు విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. వీరికి మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సహకరిస్తు న్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. వరదలు వస్తే నగరవాసులకు ప్ర మాదమే. ఆక్రమణలు తొలగించాల్సిందే. – వీ ప్రభాకర్, న్యూడెమోక్రసీ నాయకుడు

అడ్డేముంది.. ఆక్రమించేద్దాం!

అడ్డేముంది.. ఆక్రమించేద్దాం!

అడ్డేముంది.. ఆక్రమించేద్దాం!

అడ్డేముంది.. ఆక్రమించేద్దాం!

అడ్డేముంది.. ఆక్రమించేద్దాం!

అడ్డేముంది.. ఆక్రమించేద్దాం!

అడ్డేముంది.. ఆక్రమించేద్దాం!

అడ్డేముంది.. ఆక్రమించేద్దాం!

అడ్డేముంది.. ఆక్రమించేద్దాం!