
గెట్ అవుట్..!
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
– 4లో u
కాంగ్రెస్ కోవర్టా..
ఆ మాజీ ప్రజాప్రతినిధి నిత్యం కేసీఆర్‌తో, ఫామ్‌హౌస్‌లో ఉంటూనే పార్టీ అంతర్గత విషయాలు, వ్యవహారాలన్నింటినీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నిహితుడికి వాట్సాప్ ద్వారా చేరవేసినట్లు కేసీఆర్, కేటీఆర్ తెలుసుకున్నట్లు తెలిసింది. దీంతో కేసీఆర్ అతడిని ఫామ్‌హౌస్ నుంచి గెట్ అవుట్ అని గద్దించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ ప్రతి అంతర్గత వ్యవహారాన్ని పూసగుచ్చినట్లు కాంగ్రెస్ నాయకులకు చేరవేశాడని పలువురు కార్యకర్తలు ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో, హైదరాబాద్‌లో విచ్చలవిడిగా భూ ఆక్రమణలు, బెదిరింపులు, దౌర్జన్యాలు చేశాడని, అలాంటి వ్యక్తిని భవిష్యత్‌లో దరిదాపుల్లోకి రానివ్వొద్దని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చే స్తున్నారు. నియోజకవర్గంలో సైతం అభివృద్ధి పనుల పేరిట పలువురి వద్ద, అలాగే ఎన్‌ఆర్‌ఐల నుంచి అప్పు పేరుతో డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినట్లు కథలుకథలుగా బయటకు వస్తున్నాయి. అధికారం ఉన్న సమయంలో అనేకమంది స్థానిక ప్రజాప్రతినిధులను చంపేస్తానని బెదిరించిన సదరు మాజీ.. ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదని పలువురు అంటున్నారు. అతడి కారణంగా ఓ సర్పంచ్ దంప తులు జైలుపాలైన విషయాన్ని గుర్తు చేస్తున్నా రు. నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో ఈడ్చికొట్టిన ఇన్నాళ్లకై నా కేసీఆర్ గెంటేయడం పార్టీకి మేలు చేస్తుందని జిల్లా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
పార్టీని అన్నీతానై నడిపిస్తున్నానని, అధినేత కుటుంబానికి వీరవిధేయుడినని తన వ్యవహార శైలితో సెల్ఫ్‌డబ్బా కొట్టుకునే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేను బీఆర్‌ఎస్ అధినేత ‘గెట్ అవుట్’ అన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారంలో ఉన్న కాలంలో వివాదాలకు కేంద్రంగా ఉన్న ఆయన.. అధికారం దూరమైన తరువాత అంతకు మించి సెంటర్‌పాయింట్ అయ్యారు. తాజాగా ఆ మాజీ ప్రజాప్రతినిధిని బీఆర్‌ఎస్ అధినేత దూరంపెట్టినట్లు సమాచారం.
● జిల్లాకు చెందిన
మాజీ ఎమ్మెల్యేపై కేసీఆర్ కన్నెర్ర
● ఫామ్‌హౌస్ నుంచి బయటికి
గెంటేసినట్లు ప్రచారం
● పార్టీ అంతర్గత వ్యవహారాలను
కాంగ్రెస్‌కు చేరవేశాడనే ఆరోపణలు
● సోషల్ మీడియాలో
వైరల్ అవుతున్న వ్యవహారం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ కుటుంబానికి వీరవిధేయుడినని తనకుతాను ప్రచారం చేసుకునే ఓ మాజీ ఎమ్మెల్యేను ‘గెట్ అవుట్’ అంటూ బయటకు గెంటేసినట్లు వివిధ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆ మాజీ.. అధికార పార్టీకి కోవర్టుగా మారి వెలగబెట్టిన వ్యవహారాలపై చర్చించుకుంటూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలే కాదు కేసీఆర్ సైతం విస్తుపోయినట్లు సమాచారం. కేసీఆర్ చరిష్మాతో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సదరు నేత అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని ఇప్పటికే అన్నివర్గాల్లో ఆగ్రహం ఉంది.
అయితే సదరు మాజీ ఎమ్మెల్యే వ్యవహారాలు, అతడిని ఫామ్‌హౌస్ నుంచి గెంటేసిన దానిపై సోషల్ మీడియాలోనూ చర్చ సాగు తోంది. అధికారంలో ఉన్న సమయంలో అడ్డూఅదుపు లేకుండా, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా భూదందాలు, దౌర్జన్యాలకు పాల్పడిన అతడిని నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో మూడోస్థానానికి పరిమితం చేశారు. ఇప్పటికీ ఆయన నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో తిరగలేని పరిస్థితి. అధికారం దూరమైన తరువాత ఏదో వచ్చామని చెప్పుకునేలా వేళ్లమీద లెక్కపెట్టేన్ని సార్లు మాత్రమే నియోజకవర్గానికి రావడం గమనార్హం. అయితే సదరు మాజీ ఎమ్మెల్యే ప్రతిరోజూ కేసీఆర్ కుటుంబంతో, ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని అంతా భావించారు. పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఎవరూ ఊహించని రీతిలో ఉండడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి.
పార్టీని గాలికొదిలేసి..
అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలుగా అడ్డగోలు వ్యవహారాలు నడిపిన వారు ఓటమి తరువాత పార్టీని గాలికొదిలేశారని బీఆర్‌ఎస్ శ్రేణులు వాపోతున్నాయి. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని గత కొంతకాలంగా కవిత ఆరోపణలు చేస్తున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుండగా, మూడో స్థానంతో ఓటమి పాలైన మరో మాజీ నియోజకవర్గానికి తూతూమంత్రంగా వచ్చి వెళ్తున్నాడని కార్యకర్తలు అంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కౌంటర్ చేయడంలో మూడో స్థానంతో సరిపెట్టుకుని ఓటమిపాలైన ఆ మాజీ ఎమ్మెల్యే తనకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాడని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కనీసం ప్రెస్‌మీట్ సైతం పెట్టలేదని దీంతోపాటు అనేక అంశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నారని వివిధ వర్గాల్లో చర్చ సాగుతోంది. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ చేస్తుండడం ఇందుకు నిదర్శనమని బీఆర్‌ఎస్ కార్యకర్తలు పేర్కొంటున్నారు.
న్యూస్‌రీల్
కవిత ఓటమిలోనూ కీలక పాత్ర..!
తాజాగా కేసీఆర్ కన్నెర్రజేసి బయటకు వెళ్లగొట్టిన ఆ మాజీ ఎమ్మెల్యే.. ఎంపీగా కవిత ఓటమిపాలు కావడంలో కీలక పాత్ర పోషించినట్లు నాటి నుంచి చర్చ జరుగుతోంది. కవిత ఓటమి తరువాత హైదరాబాద్, గోవా, దుబాయ్‌లలో దావత్‌లు చేసుకున్నట్లు పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. కవిత ఓటమిలో జిల్లాకు చెందిన మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం.

గెట్ అవుట్..!

గెట్ అవుట్..!