పీజీ పరీక్షల ఫీజు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పీజీ పరీక్షల ఫీజు చెల్లించాలి

Jul 3 2025 4:40 AM | Updated on Jul 3 2025 4:40 AM

పీజీ

పీజీ పరీక్షల ఫీజు చెల్లించాలి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ, ఇంటిగ్రేటెడ్‌ (ఐదేళ్ల) పీజీ సెమిస్టర్స్‌లకు సంబంధించి రెగ్యులర్‌, ప్రాక్టికల్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్‌ బుధవారం వెలువడింది. పీజీ 2, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ (థియరీ, ప్రాక్టికల్‌), ఇంటిగ్రేటెడ్‌ ఐఎంబీఏ 8, 10వ సెమిస్టర్‌, బీఎల్‌ఐఎస్సీ 2వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫీజు చెల్లించాలని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ కే సంపత్‌కుమార్‌ తెలిపారు. పీజీతోపాటు ఇంటిగ్రేటెడ్‌ పీజీ ఏపీఈ అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.500 లు ఫీజు, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఇంటిగ్రేటెడ్‌ పీసీహెచ్‌ అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.600 లు ఫీజు, ఎంఏబీ, ఐఎంబీఏ, ఎంసీఏ అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.800 లు ఫీజు ఈ నెల 15 వరకు చెల్లించాలని కంట్రోలర్‌ తెలిపారు. రూ. 100 ల అపరాధ రుసుముతో ఈ నెల 18వరకు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు.

బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫీజు..

తెయూ పరిధిలోని పీజీ 1, 3, 5, 7, 9వ సెమిస్టర్‌, ఎల్‌ఎల్‌బీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ ఏపీఈ, ఐంఎబీఏ, ఐపీసీహెచ్‌, 2వ, 6వ సెమిస్టర్‌, ఐఎంబీఏ 8, 10వ సెమిస్టర్‌, బీఎల్‌ఐఎస్సీ 1వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫీజు ఈ నెల 15 వరకు చెల్లించాలని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ కే సంపత్‌కుమార్‌ తెలిపారు. రూ. 100ల అపరాధ రుసుముతో ఈ నెల 18వరకు చెల్లించే అ వకాశం ఉంటుందన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ www. telanganauniversity. ac. in ను సందర్శించాలని సూచించారు.

తీర్థయాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు

ఆర్మూర్‌ టౌన్‌: ఆర్మూర్‌ ఆర్టీసీ డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్సు నడపుతున్నట్లు మేనేజర్‌ రవికుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాణిపాకం, వేలూరు గోల్డెన్‌ టెంపుల్‌, అరుణాచలం, జోగులాంబ శక్తిపీఠం దర్శనానికి బస్సు నడపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8న బస్సు బయల్దేరుతుందని, తిరిగి 11వ తేదీన రాత్రి 10 గంటలకు ఆర్మూర్‌కు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ. 5100, పిల్లలకు రూ.2600 కలదన్నారు. ఆసక్తిగల భక్తులు రిజర్వేషన్‌ కౌంటర్‌ లో టికెట్‌ బుక్‌ చేసుకోవాలని తెలిపారు.

యోగా భవన్‌కు

అర్బన్‌ ఎమ్మెల్యే విరాళం

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి జిల్లా యోగా భవన్‌కు నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా కిసాన్‌ క్లాథ్‌ ఎంపోరియం ద్వారా రూ.లక్ష విరాళం అందజేసినట్లు జిల్లా యోగా అండ్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాంరెడ్డి తెలిపారు. తాము కోరిన వెంటనే రూ.లక్ష విరాళం అందజేసిన ఎమ్మెల్యేకు అసోసియేషన్‌ ప్రతినిధులు అంజయ్యగుప్తా, రఘుకుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఇన్‌చార్జి ఎంహెచ్‌వోగా రవిబాబు

నిజామాబాద్‌ సిటీ: మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం రవిబాబుకు కమిషన ర్‌ దిలీప్‌కుమార్‌ ఇన్‌ చార్జి ఎంహెచ్‌వోగా బుధవారం అదనపు బాధ్య తలు అప్పగించారు. గతంలో డీసీ రాజేంద్రకుమార్‌ కూడా శానిటేషన్‌ బాధ్యతలు నిర్వర్తించారు. శానిటేషన్‌ విభాగాన్ని గాడిలో పెట్టాలని కమిషనర్‌ రవిబాబుకు సూచించారు. బల్దియాకు పర్మినెంట్‌ ఎంహెచ్‌వో పోస్టు ఖాళీగా ఉంది. రెండేళ్లకు పైగా మున్సిపల్‌ వైద్యాధికారి లేకపోవడంతో శానిటేషన్‌ వ్యవస్థ అధ్వానంగా త యారైంది. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు అవి నీతిలో కూరుకుపోయారు. మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బందిని హెచ్చరించినా వారు తమ పనీతీరు మార్చుకోవడం లేదు.దీంతో డీసీ రవిబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

గదిలేక రోడ్డు పక్కనే..

పిల్లలు, గర్భిణులకు టీకాలు

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ పట్టణంలోని 35 వ వార్డులో ప్రతి బుధవారం చిన్నారులకు, గర్భిణులకు ఏఎన్‌ఎంలు టీకాలు ఇస్తుంటారు. కా నీ, సరైన గది సౌకర్యం లేకపోవడంతో రోడ్లపై నే టీకాలు వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రో డ్లపై నిలబడాలంటే ఇబ్బందిగా ఉందని, కూ ర్చునేందుకు సరైన స్థలం కూడా లేదని గర్భి ణులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి గది కేటాయించాలని కోరుతున్నారు. ఈ విషయ మై ఏఎన్‌ఎంలు రాజవ్వ, ప్రవళికతో మా ట్లాడగా గతంలో ఓ సంఘంలో కూర్చొని టీకా లు వేసే వాళ్లమని, ఇప్పుడు లేదన్నారు.

పీజీ పరీక్షల ఫీజు చెల్లించాలి 1
1/1

పీజీ పరీక్షల ఫీజు చెల్లించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement