
పీడీఏ జిల్లా అధ్యక్షుడిగా ప్రతాప్‌గుప్తా
బోధన్ : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (పీడీఏ) జిల్లా అధ్యక్షుడిగా బోధన్ పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ ప్రాంతానికి చెందిన చిదుర ప్రతాప్‌గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జిల్లా కేంద్రంలో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా ప్రతాప్‌గుప్తా, ప్ర ధాన కార్యదర్శిగా పూర్ణప్రసాద్, కోశాధికారి గా విజయ్‌కుమార్‌స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని లయన్స్ కంటి ఆ స్పత్రిలో ప్రతాప్‌గుప్తాను బుధవారం లయ న్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. లయన్స్ కంటి ఆస్పత్రి వ్య వస్థాపకులు పోలవరపు బసవేశ్వర్‌రావు, క్ల బ్ ప్రతినిధులు కొడాలి కిశోర్, వై శ్రీనివాస్‌రావు, పావులూరి వెంకటేశ్వర్‌రావు, శ్రీధర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీలోకి
పెరిగిన ఇన్‌ఫ్లో
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మంగళవారం బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురువడంతో వరద ప్రవాహం పెరిగి 6,700 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నీటి మట్టం పెరుగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆవిరి రూపంలో 304 క్యూసెక్కుల నీరుపోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1065.40(16.8టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 6 టీఎంసీల నీరు ఎక్కువగా ఉంది. గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్‌లో 10.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
‘సహకారం’తో రైతులు, కార్మికులకు ప్రయోజనం
సుభాష్‌నగర్ : సహకార వ్యవస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యాపారులు లాభపడుతున్నారని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మ న్ కుంట రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ కో ఆపరేటీవ్ అలయెన్స్ (ఐసీఏ) ఆధ్వర్యంలో లండన్ లోని మాంచెస్టర్ నగరంలో కో ఆపరేటీవ్ యాక్టివిటీస్ అనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో ఆపరేటీవ్ బ్యాంక్స్ లిమిటెడ్ (ఎన్‌ఏఎఫ్‌ఎస్‌సీఓబీ) తరఫున కుంట రమేశ్‌రెడ్డి సదస్సుకు హాజరై ప్రసంగించారు. యూఎన్‌వో 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ స హకార సంవత్సరంగా ప్రకటించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహకార సంస్థలు రైతులకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయని, గ్రామీణ వ్యవస్థకు మూలాధారంగా ఉన్నాయని పే ర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అందిస్తున్న సౌ కర్యాలను రమేశ్‌రెడ్డి వివరించారు.
5న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక
నిజామాబాద్‌అర్బన్ : ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈనెల 5వ తేదీన జిల్లాకు రానున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించనున్న సమీక్షాసమావేశంలో పాల్గొంటారు. ఎస్సీ రిజర్వేషన్ అమలు, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే దాని కి సంబంధించిన విధివిధానాలు, రిజర్వేషన్లపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు సమీక్ష సమావేశంలో వెంకటయ్య పాల్గొని అనంతరం కామారెడ్డికి వెళ్తారు.