
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
● రోడ్డు భద్రతా కమిటీ
సమావేశంలో కలెక్టర్, సీపీ
నిజామాబాద్‌అర్బన్ : రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంబంధిత అధికారులకు సూచించారు. స మీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన బుధవారం రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్, రవా ణా, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, జాతీయ ర హదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొనగా, రోడ్డు ప్రమాదా ల నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చ ర్చించారు. 44, 63వ నంబర్ జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్ర మాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న ప్రదేశాలను ఇప్పటికే బ్లాక్ స్పాట్లుగా పరిగణిస్తూ గత స మావేశాల్లో చేపట్టాల్సిన చర్యలపై తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేలా చూడాలన్నారు. పోలీస్, ఆర్ అండ్ బీ, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ తదితర శాఖలు స మన్వయంతో పని చేయాలన్నారు. ఇప్పటికే కొన్ని బ్లాక్‌స్పాట్ల వద్ద చర్యలు చేపట్టడంతో 2023 సంవత్సరం నుంచి పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గు తూ వస్తున్నాయన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాల్లోని ముఖ్య కూడళ్లు, ప్రధాన మా ర్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రత్యేక దష్టి సారించాలని అన్నారు. రోడ్లను ఆక్రమించి బోర్డులు దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని తొలగించాలని, రోడ్లపై వాహనాలు పార్కింగ్ చే యకుండా చూడాలన్నారు. ప్రధాన రహదారులపై ధాన్యం, మొక్కజొన్న వంటి పంట దిగుబడలు ఆరబోయకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, రెడ్‌క్రాస్ ప్రతినిధి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.