
పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ
డిచ్‌పల్లి: విధి నిర్వహణలో పోలీసులు ఒత్తిడికి గురవుతుంటారని, ఒత్తిడిని జయించి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని టీజీఎస్‌పీ ఏడో బెటాలియన్, డిచ్‌పల్లి కమాండెంట్ పి సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం బెటాలియన్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. హాస్పిటల్‌కు చెందిన వివిధ విభాగాల డాక్టర్‌లు బెటాలియన్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. కమాండెంట్ మాట్లాడుతూ.. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కేపీ శరత్‌కుమార్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, బెటాలియన్ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.