
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
డిచ్‌పల్లి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–4, యూనిట్–1 ప్రోగ్రాం ఆఫీసర్లు స్రవంతి, స్వప్న పేర్కొన్నారు. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వేసవి కాల ప్రత్యేక శిబిరంలో భాగంగా శుక్రవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.
గిరిరాజ్ కాలేజ్ ఆధ్వర్యంలో..
డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)లో శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–3 ఆధ్వర్యంలో వేసవి ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు.
ఆకుల కొండూర్‌లో..
నిజామాబాద్ రూరల్: రూరల్ మండలంలోని ఆకుల కొండూరు గ్రామంలో గిరిరాజ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభించారు.
నర్సింగ్‌పల్లి, మోపాల్‌లో..
మోపాల్: మండలంలోని నర్సింగ్‌పల్లిలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్–2 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో వేసవి శిబిరాన్ని నిర్వహించారు. అలాగే ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–5 ఆధ్వర్యంలో మోపాల్‌లో వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేశారు.