
మానవసేవే మాధవసేవ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మానవసేవే మాధవసేవ అని, ప్రతి ఒక్కరూ ఎదుటివారికి సహాయం చేస్తే సమస్య లు పరిష్కారమవుతాయని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం స్వామీజీ ఇందూరులోని ఉత్తర తిరుపతి క్షేత్రానికి వచ్చి భక్తులకు ప్రవచనాలు ఇచ్చారు. ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకోవాలన్నారు. భక్తిభావంతోనే సమాజం శ్రేయస్కరంగా ఉంటుందన్నారు. క్రమశిక్షణతో జీవనవిధానం కొనసాగించాలన్నారు. పుణ్యక్షేత్రాల వద్ద భక్తులు క్రమశిక్షణతో ఉండాలన్నారు. తొక్కిసలాట లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూసుకోవా లన్నారు. తిరుపతిలో దుర్ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. వైకుంఠ ఏకాదశి నుంచి పదిరోజుల పాటు దర్శనాలు చేసుకోవచ్చన్నారు. పరమాత్ముని అనుగ్రహం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర తిరుపతి ఆలయ ఫౌండర్ ట్రస్టీ సంపత్, మైసూరు పీఠం మేనేజరు రమేష్ పాల్గొన్నారు.