‘చెట్లను బరాబర్‌ నరుకుతా..!’ | Sakshi
Sakshi News home page

‘చెట్లను బరాబర్‌ నరుకుతా..!’

Published Tue, May 21 2024 5:45 AM

‘చెట్లను బరాబర్‌ నరుకుతా..!’

బాన్సువాడ రూరల్‌: పట్టణాల్లోనే కాదు పల్లెల్లోనూ పార్కులు ఉండాలనే ఉద్దేశంతో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడానికి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. నీడనిచ్చే మొక్కలతో పాటు రకరకాల పూలు, పండ్లు అందించే అందమైన మొక్కలను నాటి మూడేళ్లుగా సంరక్షిస్తున్న విషయం అందరికి తెలిసిందే. కాగా కొత్తాబాది జీపీ పరిధిలోని సంతోష్‌నగర్‌ తండా పల్లెప్రకృతి వనంలో ఉన్న చెట్లను అదే తండాకు చెందిన చందర్‌ అనే వ్యక్తి ఈనెల 10న 30కి పైగా చెట్లను నరికి వేశాడు. చెట్లను నరికివేస్తున్న విషయం తెలిసి పంచాయితీ కార్యదర్శి గణేష్‌ సూచన మేరకు కారోబార్‌ వెళ్లి నరికివేతను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో చందర్‌ చెట్ల నరికివేత ఆపేదిలేదని దిక్కున్న చోట చెప్పుకోమంటూ హెచ్చరించడంతో వెనుదిరిగాడు. అదేరోజు పంచాయితీ కార్యదర్శి, నిందితుడు చందర్‌కు నోటీసు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదు. తానే చెట్లను నరికానని ఏదైనా జరిమానా విధిస్తే చెల్లిస్తానంటూ పంచాయితీ కార్యదర్శి ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో ఉన్నతాధికారుల సూచన మేరకు సోమవారం కొత్తాబాది పంచాయితీ కార్యదర్శి బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్నామని నిందితుడిని విచారించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు.

జరిమానా వేస్తే చెల్లిస్తా

పల్లె ప్రకృతి వనంలో 30 చెట్లు నరికిన సంతోష్‌నగర్‌ తండావాసి

Advertisement
 
Advertisement
 
Advertisement