మూర్ఛతో యువకుడు.. | Sakshi
Sakshi News home page

మూర్ఛతో యువకుడు..

Published Tue, May 21 2024 5:45 AM

మూర్ఛతో యువకుడు..

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మండలంలోని సిర్‌ పూర్‌ గ్రామానికిచెందిన ముత్యాల సాయికుమార్‌(20) మూర్ఛ వ్యాధితో సోమవారం సాయంత్రం మృతి చెందాడు. ఎస్సై గంగాధర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాయికుమార్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. గత నాలుగైదు రోజులపాటు ఇసుక తరలించే పనికి వెళ్లాడు. సోమవారం స్నేహితుడితో కలిసి మద్యం సేవిస్తుండగా సాయికుమార్‌ కాళ్లు, చేతులు కొట్టుకుంటూ పడిపోయాడు. వెంటనే అతడి స్నేహితుడు మరో వ్యక్తిని పిలిపించి సాయికుమార్‌ తల్లికి సమాచారం ఇచ్చారు. ఆటోలో ఇంటికి తీసుకెళ్లి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ వచ్చేలోపే సాయికుమా ర్‌ మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్రీనివాస్‌ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లగా, తల్లి గంగామ ణి బీడీ కార్మికురాలు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంగామణి, శ్రీనివాస్‌ దంపతుల కుమార్తె గతంలో మృతి చెందగా, ఇప్పుడు కుమారుడు మృతి చెందడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement