వస్తువుల కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

వస్తువుల కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలి

Published Tue, May 21 2024 5:45 AM

వస్తువుల కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలి

నిజామాబాద్‌నాగారం: వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా అధ్యక్షుడు మాయావర్‌ రాజేశ్వర్‌ సూచించారు. నగరంలోని పాత గంజ్‌లో లీగల్‌ మెట్రాలజీ తూనికల కొలతల దినోత్సవాన్ని అసిస్టెంట్‌ కంట్రోలర్‌ నిర్మల్‌కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌ మాట్లాడుతూ.. వస్తువులపై ఐఎస్‌ఐ, ఆగ్‌మార్క్‌ చూసి కొనుగోలు చేయాలని, రసీదు తప్పకుండా తీసుకోవాలన్నారు. బిల్లు ఉంటే వినియోగదారుల కోర్టులో కేసు వేసే వీలుంటుందని పేర్కొన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తే జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారులకు, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రానికి వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ సుజాత, అలీ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సురేందర్‌రావు, నరేశ్‌, సుస్మిత్‌, వినియోగదారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement