సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

Published Thu, Apr 18 2024 9:35 AM

-

బోధన్‌: ప్రతి ఏడాది బాసర ట్రిఫుల్‌ ఐటీలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. పట్టణ కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కమిటీ ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌ రెడ్డికి ఎన్నికలపై ఉ న్న శ్రద్ధ ట్రిఫుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్యపై లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడిచినా ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రిని కేటాయించక పోవడం దారుణ మని పేర్కొన్నారు. నాయకులు మహేశ్‌, విఘ్నేష్‌, ప్రశాంత్‌, రాజేశ్‌, విష్ణు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement