వైభవంగా శ్రీరామ నవమి | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీరామ నవమి

Published Thu, Apr 18 2024 9:35 AM

ఖిల్లా రామాలయంలో దర్శనానికి క్యూ కట్టిన భక్తులు  - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ని యోజకవర్గాల్లో బుధవారం శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, గ్రామాల్లో గల రామాలయాల్లో వేద మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల వారి కల్యాణం జరిపారు. ఉత్సవాలకు ఒకరోజు ముందుగానే ఆల య కమిటీల ఆధ్వర్యంలో ఆలయాలను విద్యుత్‌ కాంతులతో ముస్తాబు చేసి, ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. పలు గ్రామాల్లో ఉత్సవ విగ్రహాలకు శోభాయా త్ర నిర్వహించారు. అనంతరం భాజాభజంత్రీలు, వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారా ముల కల్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన ఖిల్లా రామాలయం, సుభాష్‌నగర్‌ కోదండ రామాలయం, ఆర్యనగర్‌ రామాలయంలో భక్తుల జయజయ ధ్వానాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి. ఖిల్లా రామాలయంలో శ్రీరాముడి కల్యాణం జరిపించిన మాజీ మేయర్‌ ఆకుల సుజాత శ్రీశైలం, ఎస్‌ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల అధినేత మారయ్యగౌడ్‌ దంపతులు, మంచాల జ్ఞానేందర్‌ దంపతులు పూలదండలతో నృత్యాలు చేశారు.

పాల్గొన్న ప్రజాప్రతినిధులు..

నగరంలోని రామాలయాలలో జరిగిన సీతారామ కల్యాణ వేడుకల్లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆలయాలలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటి సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యేలను సన్మానించారు. నగరంలోని పెద్ద రాంమందిరంలో రాముడు జన్మించిన ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ పాల్గొని, ఊయల ఊపు తూ భక్తి కీర్తనలు అలపించారు. అనంతరం రాం మఠం ఉత్తరాధికారి సీతారామచంద్రమూర్తి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. దేవాదాయశాఖ ఏసీ ఎన్‌ సుప్రియ, ఆలయ ఈవో వేణు, ఇందూరు బ్రా హ్మణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఖిల్లా రామాలయంలో శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు నీటిని, ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. గూ పన్‌పల్లిలోని మహాలక్ష్మీ ఆలయంలో రూరల్‌ ఎమ్మె ల్యే భూపతిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూరల్‌ నియోజకవర్గంలోని పలు రామాలయాల్లో సీతారాముల కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జెడ్పీచైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రామాలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించిన అర్చకులు

ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement