నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు | Sakshi
Sakshi News home page

నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు

Published Thu, Apr 18 2024 9:35 AM

- - Sakshi

సుభాష్‌నగర్‌, నిజామాబాద్‌నాగారం: పార్లమెంట్‌ ఎన్నికలు–2024 నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం గురువారం విడుదల చేయనుంది. ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించిన విషయంతెలిసిందే. నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే అభ్యర్థుల నుంచి నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో నామినేషన్‌ పత్రాలు స్వీకరించనున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు నేతృత్వంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఎన్నికల అధికారిగా కలెక్టర్‌

పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు వ్యవహరించనున్నారు. పార్లమెంట్‌ పరిధిలో జిల్లా నుంచి నిజామాబాద్‌ రూరల్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బాల్కొండ, ఆర్మూర్‌, బోధన్‌ నియోజకవర్గాలున్నాయి. అందులో మొత్తం 1,549 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

● షెడ్యూల్‌ వెలువడక ముందు నుంచే ఓటర్ల నమోదు, రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో ఫస్ట్‌ లెవల్‌ ఈవీఎంల పరిశీలన, తదితర ఏర్పాట్లు చేశారు.

● పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు, పరిశీలన, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తించి పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు.

● సరిహద్దుల్లో అంతర్రాష్ట, జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా కేంద్ర బలగాలు, పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. రెవెన్యూ, వాణిజ్య పన్నులశాఖ, పోలీసులతో తనిఖీ బృందాలు నియమించారు. నగదు, బంగారం తరలింపుపై నిఘా పెంచారు. గ్రీవెన్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

● ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందిని నియమించి శిక్షణను పూర్తిచేశారు.

అసెంబ్లీ నియోజవర్గాలు 7

పోలింగ్‌ కేంద్రాలు 1807

ఎన్నికల సిబ్బంది 7769

మొత్తం ఓటర్లు 17,01,573

85ఏళ్లకు పైబడిన వృద్ధులు 9,874

దివ్యాంగులు 41,181

ఇప్పటికే ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ పూర్తి కాగా, నామినేషన్లు పూర్తయ్యాక రెండో లెవల్‌, పోలింగ్‌కు ముందు రోజు మూడో లెవల్‌ చెకింగ్‌ చేయనున్నారు.

సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేశారు. రెండో విడత ర్యాండమైజేషన్‌ అభ్యర్థుల సమక్షంలో చేపట్టనున్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులను ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయించారు. వీరికి మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా పోలింగ్‌ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించారు.

పార్లమెంట్‌ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ పాట్ల కేటాయించారు. పోలింగ్‌ రోజు ఉదయం 6 గంటలకు మాక్‌ పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో చేపట్టనున్నారు.

డిచ్‌పల్లిలోని సీఎంసీ మెడికల్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన అన్నిచర్యలు చేపడుతున్నారు.

నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. కలెక్టర్‌ చాంబర్‌లోనే అభ్యర్థులు నా మినేషన్లు వేయనున్నారు. కలెక్టరేట్‌ ప్రాంతమంతా 144 సెక్షన్‌ అమలులో ఉండనుంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement