నిజామాబాద్‌ | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Published Thu, Apr 18 2024 9:30 AM

- - Sakshi

వాతావరణం

ఉదయం ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రాత్రి నిర్మలంగా ఉంటుంది. అక్కడక్కడ జల్లులు కురియవచ్చు.

పెట్టుబడి స్వల్పం..

తక్కువ పెట్టుబడితో కొత్తిమీర సాగు చేస్తూ ఎక్కువ లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంకాపూర్‌ రైతు సాయరెడ్డి.

గురువారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024

– 8లో u

నగరంలోని సుభాష్‌నగర్‌ రామాలయంలో తలంబ్రాలు పోస్తున్న వేదపండితుడు

జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో కల్యాణోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు

తాళిబొట్టును

చూపిస్తున్న

అర్చకుడు

కల్యాణ

వైభోగమే..

శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయం, సుభాష్‌నగర్‌ కోదండ రామాలయం, డిచ్‌పల్లిలోని ఖిల్లా రామాలయం, ఆర్యనగర్‌ రామాలయంలో భక్తుల జయజయ ధ్వానాలు, మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. చైత్రశుద్ధ నవమి రోజు రామచంద్రస్వామి పుట్టిన పునర్వసు నక్షత్రంలోనే రాములవారు సీతమ్మను పరిణయమాడారు. శ్రీ సీతారాముల కల్యాణ ఘట్టాన్ని వీక్షించిన భక్తులు పులకరించిపోయారు. ఖిల్లా రామాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, డిచ్‌పల్లి రామాలయంలో భూపతిరెడ్డి, డొంకేశ్వర్‌ రామాలయంలో పైడి రాకేశ్‌రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

న్యూస్‌రీల్‌

1/4

2/4

3/4

4/4

Advertisement
 

తప్పక చదవండి

Advertisement