రోడ్డు ప్రమాదంలో యువకుడు.. | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

Published Thu, Apr 18 2024 1:00 AM

రోదిస్తున్న బాధితులు  - Sakshi

నిజామాబాద్‌ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన మార్వాడే దమాపాల్‌ (33) మృతి చెందినట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో మహేశ్‌ బుధవారం తెలిపారు. నగరంలోని గౌతమ్‌నగర్‌కు చెందిన ధమాపాల్‌ మంగళవారం స్నేహితులు ఉమాకాంత్‌, వినోద్‌తో బైక్‌పై వెళ్తున్నాడు. బైపాస్‌ రోడ్డులో శ్మశానం వైపు యూటర్న్‌ చేస్తుండగా అర్సపల్లి వైపు నుంచి వస్తున్న బొలెరో ఢీకొంది. ప్రమాదంలో దమపాల్‌ అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుడి తండ్రి గౌతమ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌హెచ్‌వో తెలిపారు.

ఎల్పుగొండలో గుడిసె దగ్ధం

మాచారెడ్డి: పాల్వంచ మండలం ఎల్పుగొండలో షార్ట్‌ సర్క్యూట్‌తో గుడిసె కాలిపోయింది. గ్రామానికి చెందిన ఇప్పల్ల లక్ష్మి బుధవారం మధ్యాహ్నం శ్రీరామ నవమి సందర్భంగా గ్రామంలోని రామాలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణానికి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి షార్ట్‌ సర్క్యూట్‌తో గుడిసె కాలి బూడిదైంది. కుల సంఘంలో తీసుకున్న అప్పు చెల్లించడానికి తీసుకొచ్చిన రూ.లక్ష నగదు, సామగ్రి కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement