ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

Published Thu, Apr 18 2024 1:00 AM

- - Sakshi

పిట్లం(జుక్కల్‌): మండలంలోని కుర్తి గేట్‌ సమీపంలో బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం రోడ్డు కిందకు దూసుకెళ్లింది బాన్సువాడ నుంచి పిట్లం వైపు వెళ్తున్న బస్సు కుర్తి గేట్‌ వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.

వ్యాన్‌ను ఢీకొన్న బస్సు

భిక్కనూరు: భిక్కనూరు టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. నిజామాబాద్‌ వైపు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న వ్యాన్‌ ఢీకొంది. వ్యాన్‌ డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు అద్దాలు ధ్వంసం పగిలిపోయాయి.

బెల్ట్‌షాపుపై దాడి

ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మిర్చికంపౌండ్‌లో బెల్ట్‌ షాపు నిర్వహిస్తున్న సయ్యద్‌ బషీర్‌ అలియాస్‌ అజ్జును అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌హెచ్‌వో విజయ్‌ బాబు తెలిపారు. బుధవారం బెల్ట్‌షాపుపై దాడి చేసి 157 క్వార్టర్స్‌, 8 బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

పెద్దకొడప్‌గల్‌: మండలంలోని బెల్ట్‌ షాపులపై బుధవారం ఎకై ్సజ్‌ అధికారులు దాడులు చేశారు. మండలంలోని వడ్లం గ్రామంలో కిరాణం దుకాణాంలో మద్యం అమ్ముతున్న జ్ఞానేశ్వర్‌ను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు.

1/1

Advertisement
 
Advertisement