అఫిడవిట్‌లో తప్పులుంటే తిప్పలే! | Sakshi
Sakshi News home page

అఫిడవిట్‌లో తప్పులుంటే తిప్పలే!

Published Thu, Apr 18 2024 1:00 AM

-

ఖలీల్‌వాడి: ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌ కీలకంగా మారుతుంది. లోకసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు పూర్తి వివరాలను అఫిడవిట్‌లో పొందుపర్చాలి. అప్పులు, ఆస్తులు, కేసులు, శిక్షల గురించి తెలియజేయాలి. అభ్యర్థులు ఇచ్చిన అఫిడవిట్‌లో తప్పులు ఉంటే గెలిచిన తర్వా త ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అభ్యర్థుల గురించి తెలుసుకోవడం ఓటర్ల హ క్కు. అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలతోపాటు అఫి డవిట్‌ సమర్పించాలి. ఇందులో అభ్యర్థి ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు పొందుపర్చాలి.

పూర్తిగా నింపాలి

అభ్యర్థులు అఫిడవిట్‌లో ఉన్న మొత్తం కాలమ్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. తెలియని అంశాలు ఉంటే నిల్‌ లేదా వర్తించదు అని రాయాలి. అన్ని కాల మ్స్‌ పూర్తి వివరాలతో లేకపోతే నామినేషన్ల పరిశీలన సమయంలో తిరస్కరించే అవకాశం ఉంది.

కేసుల వివరాలు పక్కాగా ఉండాలి

అభ్యర్థులపై క్రిమినల్‌, సివిల్‌ కేసులు ఉంటే అఫిడవిట్‌ పొందుపర్చాలి. కేసులలో శిక్ష అనుభవిస్తే వాటికి సంబంధించిన వివరాలు ఉండాలి. కేసులపై పై కోర్టులకు అప్పిళ్లకు వెళ్తే ఆ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. కేసులకు సంబంధించిన వివరాలను పేపర్‌లో యాడ్‌ వేయాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులు, చేతిలో ఉన్న నగదు వివరాలు వెల్లడించాలి. కుటుంబ సభ్యులు చేసే వ్యాపారాలు, కంపెనీలు, పనుల వివరాలను వివరించాలి.

ఎన్నికల సమయంలో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌లో తప్పులు ఉంటే తర్వాత తిప్పలు పడాల్సి వస్తుంది. 2023లో కొత్తగూడం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని ప్రత్యర్థులు కో ర్టుకు వెళ్లడంతో న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెల్లడించారు. తర్వాత ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి శాసనసభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్‌ అభ్యర్థి వినయ్‌కుమార్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారు.

ఆస్తులు, నేర చరిత్ర

పొందుపర్చాల్సిందే..

లేదంటే న్యాయపరంగా ఇబ్బందులు

తప్పులు ఉంటే చిక్కులు తప్పవు

అభ్యర్థులు ఫారం–26లో అన్ని రకాల వివరాలను పొందుపర్చాలి. ఇందులో ఆస్తి, కేసులు, లావాదేవీల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇస్తే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

– ఆశ నారాయణ, న్యాయవాది, నిజామాబాద్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement