అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం

Published Thu, Apr 18 2024 1:00 AM

ఆర్మూర్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో మాక్‌డ్రిల్‌ 
నిర్వహిస్తున్న అగ్నిమాపక అధికారులు(ఫైల్‌) - Sakshi

ఆర్మూర్‌టౌన్‌: అగ్ని ప్రమాదాలు జరిగే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. దీంతో అగ్ని ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అగ్ని మాపక శాఖ అధికారులు ఎక్కడ ప్రమాదం జరిగిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేస్తారు. అగ్నిప్రమాదం జరిగిన చోట తమ ధైర్య సహసాలతో ముందకు సాగి ప్రమాదాన్ని అరికడుతారు. 1944 ఏప్రిల్‌ 14న బాంబే ఓడరేవులో జరిగిన అగ్ని పమారదంలో 66మంది అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక శాఖ అధికారులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాల్లో మృతి చెందిన సిబ్బందికి నివాళులు అర్పించి, అగ్ని ప్రమదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

చేపట్టే కార్యక్రమాలు

వారోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 14న అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. 15న బహిరంగ ప్రదేశాల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన, 16న అపార్ట్‌మెంట్‌లలో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. 17న ఆస్పత్రిలలో, 18న ఎల్‌పీజీ గౌడౌన్స్‌, 19 ఫంక్షన్‌ హాల్‌, విద్యాసంస్థలు, సినిమా థియటర్‌లలో, 20 అగ్నిమాపక కేంద్రంలో ఫైర్‌ సేఫ్టిపై వర్క్‌షాప్‌ నిర్వహిస్తారు.

ఈ నెల 20 వరకు

అగ్నిమాపక వారోత్సవాలు

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న

అధికారులు

జాగ్రత్తలు తీసుకోవాలి

అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటికి తాళం వేసి బయటకు వేళ్లేటప్పుడు గ్యాస్‌ రెగ్యులేటర్‌ను ఆఫ్‌ చేయాలి. ఏసి, ఫ్రిడ్జ్‌ వైరింగ్‌ నాణ్యతను పరిశీచాలి. ప్రమాదం జరిగితే ఆందోళన చెందకుండా మంటలను ఆర్పడానికి యత్నించాలి. ప్రమాదాలు జరిగితే వెంటనే 101, 8712699228 నంబర్లకు సమాచారం అందించాలి.

– మధుసూదన్‌రెడ్డి,

అగ్నిమాపక శాఖ అధికారి, ఆర్మూర్‌

నివారణ చర్యలు

కాల్చిన సిగిరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా పడేయొద్దు.

వంటింట్లో గాలి, వెలుతుర ఉండేట్లు చూసుకోవాలి.

దుస్తులకు నిప్పు అంటుకుంటే పరిగెత్తకుండా, కింద పడుకొని బొర్లాలి. లేక దుప్పుటి చుట్టుకోవాలి.

స్కూల్‌, షాపింగ్‌ మాల్‌లో, బహుళ అంతస్తుల భవనాలలో ఫైర్‌ అలారం, ఫైర్‌ స్మోక్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలి.

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement