మోతెలో 144 సెక్షన్‌ | Sakshi
Sakshi News home page

మోతెలో 144 సెక్షన్‌

Published Thu, Apr 18 2024 1:00 AM

- - Sakshi

వేల్పూర్‌: మండలంలోని మోతె గ్రామంలో సీపీ కల్మేశ్వర్‌ ఆదేశాల మేరకు బుధవారం నుంచి ఈ నెల 20వ తేది వరకు 144 సెక్షన్‌ విధించినట్లు ఎస్సై వినయ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 144 సెక్షన్‌ ముగిసే వర కు గ్రామంలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది సమావేశం కావొద్దన్నారు. భూ వివా దం నేపథ్యంలో 144 సెక్షన్‌ విధించారు.

ఆర్మూర్‌ నుంచి తిరుపతి, ఢిల్లీకి రైళ్లు నడపాలి

కమ్మర్‌పల్లి: ఆర్మూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి తిరుపతి, న్యూఢిల్లీ వరకు రైళ్లు నడపాలని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నేషనల్‌ యూత్‌ ప్రాజెక్ట్‌, యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫ్‌ యూత్‌ ఆర్గనైజేషన్‌ దక్షిణ ఆసియా మైత్రి సదస్సు సెక్రెటరీ జనరల్‌ బీఆర్‌ నర్సింగరావు, కార్యవర్గ సభ్యులు స్వా మి, ఎం గంగాధర్‌ దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఈ మేర కు సికింద్రబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే జనర ల్‌ మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు.

సెల్‌ఫోన్‌ల అప్పగింత

కామారెడ్డి క్రైం: సెల్‌ఫోన్‌లు పోగొట్టుకున్న బా ధితులకు సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా గుర్తించి అందజేశారు.ఇటీవల దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పలువురు సెల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేయగా బుధవారం 5 ఫోన్‌లను రికవరీ చేశారు. ఆయా ఫోన్‌లను బాధితులైన గంగాధర్‌,ఇదాయత్‌,లక్ష్మి, ఆకాశ్‌, సురేశ్‌కుమార్‌ లకు ఎస్సై రాజు అప్పగించారు.

ఎల్లారెడ్డి: ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి బుధవారం అందించినట్లు ఎస్సై మహేశ్‌ తెలిపారు. ఎల్లారెడ్డికి చెందిన చిలుక సత్తయ్య, కంజర్ల సిమన్‌ ఫోన్లు చోరీకి గురి కావడంతో సీఈఐఆర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వాటి ఆచూకీని కనుక్కుని బాధితులకు అందించినట్లు ఎస్సై తెలిపారు.

ఇద్దరు బాలసదనం

బాలికల అదృశ్యం

కామారెడ్డి క్రైం: బాలసదనంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. పాఠశాల నుంచి బయటకు వెళ్లిన వారు బాలసదనంకు రాకుండా ఎక్కడికో వెళ్లిపోయారని ఫిర్యాదు రావడంతో పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో బుధవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులు లేని ఇద్దరు బాలికలు కామారెడ్డిలోని బాలసదనంలో ఉంటూ హరిజనవాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. ఎప్పటిలాగే ఈ నెల 13 న పాఠశాలకు వెళ్లిన వారిద్దరూ కొద్దిసేపటి తర్వాత ఎవరికీ చెప్పకుండానే బయటకు వెళ్లిపోయారు. చాలా చోట్ల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో బాలసదనం ఇన్‌చార్జి గంగుబాయి బుధవారం పోలీసు లకు ఫిర్యాదు చేసింది. వీరిలో ఓ అమ్మాయి గతంలో రెండు సార్లు ఇదే విధంగా వెళ్లిపోగా వెతికి తీసుకువచ్చినట్లు బాలసదనం సిబ్బంది చెబుతున్నారు.

శ్రీరాముడి జీవితం ఆదర్శం

బాన్సువాడ రూరల్‌: శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శనీయమని, రాముని సుగుణాలు ఆచరణీయం, అనుసరణీయమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం ఆయన స్వగ్రామం పోచారంతో పాటు దేశాయిపేట్‌, సోమేశ్వర్‌, కొల్లూర్‌, తిర్మలాపూర్‌ గ్రామాల్లో తన సతీమణి పుష్ప, మాజీ డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి దంపతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తిర్మలాపూర్‌లో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని కాసేపు భజన చేశారు.

1/1

 
Advertisement
 
Advertisement