గోదావరిలో ఈతకు వెళ్లి బాలుడి మృతి | Sakshi
Sakshi News home page

గోదావరిలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

Published Thu, Apr 18 2024 1:00 AM

-

రెంజల్‌: స్నేహితులతో కలిసి గోదావరి నదిలో ఈతకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీట ముని గి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కందకుర్తి గ్రామానికి చెందిన నవాజ్‌బేగ్‌(17) బుధవారం స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని మొగల్‌పుర ప్రాంతంలో గోదా వరి నదిలో ఈతకు వెళ్లాడు. ఈత రాక ప్రమాదవశాత్తు నీటిలో మునగడంతో వెంటనే అతని స్నేహితులు కుటుంబీకులకు సమాచారం అందించారు. స్థానికులతో పాటు రెంజల్‌ ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని గాలించగా నవాజ్‌ మృతదేహం లభించింది. నవాజ్‌బేగ్‌ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్సై సాయన్న తెలిపారు.

లారీ ఢీకొని ఒకరు..

ఖలీల్‌వాడి: నగరంలోని నాలుగో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బోర్గాం వద్ద బైక్‌ను లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సంజీవ్‌ తెలిపారు. మంగళవారం మోపాల్‌ నుంచి బోర్గాంకు బైక్‌పై వెళ్తున్న ప్రదీప్‌ను ఇస్మాయిల్‌ ఫ్యాక్టరీ వద్ద లారీ ఢీకొంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. లారీ డ్రైవర్‌ అప్సర్‌ అజాగ్రత్తగా నడపడంతో బైక్‌ను ఢీకొట్టినట్లు చెప్పారు. మృతుడి బావ నరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement