ఆశవర్కర్లు రోగులను రిఫర్‌ చేస్తే చర్యలు | Sakshi
Sakshi News home page

ఆశవర్కర్లు రోగులను రిఫర్‌ చేస్తే చర్యలు

Published Wed, Apr 17 2024 1:15 AM

- - Sakshi

నిజామాబాద్‌నాగారం: ఆశవర్కర్లు రోగులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో సుదర్శనం హె చ్చరించారు. ‘కమీషన్ల ఆశ చూపుతూ..’ శీర్షికన సాక్షి పత్రికలో ఈ నెల 16న ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఇప్పటికే సమీక్షలు, నెలవారీ ఆశ డే సమావేశాల్లో పీహెచ్‌సీల వారీగా ఆశ కార్యకర్తలకు నియమ నిబంధనలు తెలియజేశామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి నా, డబ్బులకు ఆశపడి రోగులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆరోగ్య సిబ్బందిని, ఆశవర్కర్లను మభ్యపెడుతున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. పలువురు పీఎంపీ, ఆర్‌ఎంపీలు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో జనవరిలో పలు క్లినిక్‌లు సీజ్‌ చేశామన్నారు. వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు రోగులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన

మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌

ఖలీల్‌వాడి: జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మంగళవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజేశ్వర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం మొదలు పెట్టారు. తర్వాత జుక్కల్‌ టికెట్‌ కోసం ప్రయత్నించిన దక్కలేదు. వైఎస్‌ఆర్‌ హయాంలో రాజేశ్వర్‌ ఎ మ్మెల్సీగా నియామకం అయ్యారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి మళ్లీ ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌ మాట్లాడుతూ.. సొంత గూటికి రావడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

20 నుంచి క్రికెట్‌లో ఉచిత శిక్షణ

నిజామాబాద్‌ నాగారం: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ఉచిత క్రికెట్‌ శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయ న మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు బాలబాలికలకు శిక్షణ ఉంటుందని తెలిపారు. నగరంలోని నగరంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానం(9849073809), కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియం(9666677786), ఆ ర్మూర్‌లో మామిడిపల్లి ఎక్స్‌రోడ్‌లోని మోడ ల్‌ స్కూల్‌లో (9640573063) శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పై నంబర్లను సంప్రదించాలని సూచించారు. కోచ్‌ ఫారస్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌తో జిల్లాలో కలకలం

మృతుల్లో ఉమ్మడి

జిల్లా వాసులున్నారని ప్రచారం

సాక్షి, కామారెడ్డి: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మృత్యువాతపడగా.. ఇందులో ఉమ్మ డి జిల్లాకు చెందిన అజ్ఞాత మావోయిస్ట్‌లు ఉన్నారన్న ప్రచారం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పది మందికిపైగా మావోయిస్ట్‌లు అజ్ఞాతంలో ఉ న్నట్టు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా ఇస్రోజీవాడికి చెందిన లోకోటి చందర్‌ అలియాస్‌ స్వామితో పాటు ఆయన కుమారుడు రమే శ్‌, కూతురు లావణ్య, పాల్వంచ మండలం ఆరేపల్లికి చెందిన ఎర్రగొల్ల రవి, సదాశివనగర్‌ మండలానికి చెందిన మరొకరు అజ్ఞాతంలో కొనసాగుతున్నారు. అలాగే నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారు కూడా పలువురు అజ్ఞాతంలో ఉన్నారు. ఎన్‌కౌంటర్‌లో జిల్లావాసులు ఉన్నారని ప్రచారం జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

1/2

2/2

Advertisement
 
Advertisement