రైతులకు సకాలంలో చెల్లింపులు | Sakshi
Sakshi News home page

రైతులకు సకాలంలో చెల్లింపులు

Published Wed, Apr 17 2024 1:15 AM

- - Sakshi

సుభాష్‌నగర్‌: యాసంగి సీజన్‌కు సంబంధించి రా ష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ఇప్పటికే 2.69 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌, అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తదితరులతో కలిసి జిల్లాలోని రైస్‌మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం గుండారం గ్రామంలోని జై గణేష్‌ ప్యాడి ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ను సందర్శించి, ధాన్యం మర పడుతున్న తీరు, స్టాక్‌ నిల్వలను పరిశీలించారు. అంతకుముందు కలెక్టరేట్‌లోని సమా వేశమందిరంలో అధికారులు, రైస్‌మిల్లర్లతో సమావేశమయ్యారు. రైస్‌మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. గతంలో కంటే రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మిల్లింగ్‌ తదితర అంశాల్లో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆశించిన రీతిలో సహాయ, సహకారాలు లభిస్తున్నాయని తెలిపారు. సీఎంఆర్‌ కేటాయింపులు లక్ష్యానికి అను గుణంగా సకాలంలో జరిగేలా ధాన్యం మిల్లింగ్‌ చేయాలని మిల్లర్లకు సూచించారు. ముఖ్యంగా పా రాబాయిల్డ్‌ బియ్యం నిల్వల అవసరం ఎక్కువగా ఉన్నందున ఏమాత్రం విరామం లేకుండా మిల్లింగ్‌ జరిపించాలన్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు మన బియ్యం ఎగుమతి చేస్తున్నందున నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ

రాష్ట్రంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 2.69 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని, గతేడాది ఈ సమయానికి 233 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించామని దేవేంద్రసింగ్‌ చౌహాన్‌ వె ల్లడించారు. ఈసారి కేంద్రాలను ముందస్తుగానే ప్రారంభించామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధా న్యం రాకుండా తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. కాగా జిల్లాలో 373 కొనుగో లు కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పటికే లక్షా 35వేల మెట్రిక్‌ టన్నుల ధా న్యం సేకరించామని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హను మంతు డీఎస్‌ చౌహాన్‌ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు రూ.98కోట్ల ధాన్యం డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నా రు. ట్రెయినీ కలెక్టర్‌ కిరణ్మయి, డీఎస్‌వో చంద్రప్రకాష్‌, సివిల్‌ సప్లైస్‌ డీఎం జగదీశ్‌, అధికారులు, రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు. కాగా అంతకుముందు జిల్లా కు చేరుకున్న ప్రిన్సిపల్‌ సెక్రెటరీ డీఎస్‌ చౌహాన్‌కు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద కలెక్టర్‌, సీపీ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

రాష్ట్రవ్యాప్తంగా 2.69 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌

ఇబ్బందులు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి

ఇందల్వాయి: రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరి దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌ ఆదేశించారు. ఇందల్వాయి మండలంలోని గన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడా రు. సకాలంలో రైతులకు డబ్బులు అందేలా చ ర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు ధాన్యా న్ని ఆరబెట్టి కేంద్రాలకు తీసుకు రావాలన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే పై అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. గన్ని బస్తాలు, లారీలు అందుబాటులో ఉంచి సకాలంలో ధాన్యం రైస్‌మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీఎస్‌వో చంద్ర ప్రకాశ్‌, సివిల్‌ సప్‌లై డీఎం జగదీశ్‌, సీఈవో రతన్‌ తదితరులు పాల్గొన్నారు.

1/1

Advertisement
 

తప్పక చదవండి

Advertisement