ప్రైవేట్‌ పాఠశాలకు నోటీసులు | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ పాఠశాలకు నోటీసులు

Published Wed, Apr 17 2024 1:10 AM

- - Sakshi

నిజామాబాద్‌ అర్బన్‌: ఫీజు చెల్లించలేదనే కారణంతో ఇద్దరు విద్యార్థులను పరీక్షకు అనుమతించని నగరంలోని అక్రిడ్జ్‌ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ మంగళవారం నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈవోకు ఫిర్యాదు చేయగా, దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ ఘటనపై స్పందించిన డీఈవో సదరు పాఠశాలకు నోటీసులు జారీ చేశారు.

ఒకరి అదృశ్యం

కామారెడ్డి క్రైం: కామారెడ్డి లోని కల్కినగర్‌ కాలనీకి చెందిన కందుకూరి కృష్ణమూర్తి అదృశ్యమైనట్లు దేవునిపల్లి ఎస్సై రాజు మంగళవారం తెలిపారు. కృష్ణమూర్తి ఐసీడీఎస్‌లో అటెండర్‌గా పని చేస్తున్నాడు. ఆర్థిక సంవత్సరం ముగింపు, ఎన్నికలకు సంబంధించిన పని మీద సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్తున్నానని చెప్పి ఫిబ్రవరి 20న ఇంటి నుండి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా కలువలేదు. మార్చి 8న భార్య వరలక్ష్మికి ఫోన్‌ చేసిన కృష్ణమూర్తి.. తాను ఎక్కడ ఉన్నది చెప్పకుండానే కట్‌ చేశాడు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజు తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement