డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో నలుగురికి జైలు శిక్ష | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో నలుగురికి జైలు శిక్ష

Published Tue, Apr 16 2024 1:05 AM

-

ఖలీల్‌వాడి: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో న్యాయమూర్తి ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్‌ ఏసీపీ నారాయణ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 27 మందికి సోమవారం నగరంలోని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్‌ ఇచ్చి మార్నింగ్‌ కోర్టులో హాజరుపర్చామన్నారు. మెజిస్ట్రేట్‌ సయ్యద్‌ ఖదీర్‌ 25 మందికి రూ.24100 జరిమానా విధించారని, మరో ఇద్దరికి రెండు రోజుల జైలుశిక్ష విధించారని తెలిపారు.

ఐదో టౌన్‌పరిధిలో..

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఇద్దరికి మెజిస్ట్రేట్‌ సయ్యద్‌ ఖదీర్‌ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఐదో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై అశోక్‌ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని, తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని ఆయన సూచించారు.

Advertisement
 
Advertisement