నేడు బోధన్‌కు జేపీ నడ్డా రాక | Sakshi
Sakshi News home page

నేడు బోధన్‌కు జేపీ నడ్డా రాక

Published Mon, Nov 27 2023 12:46 AM

- - Sakshi

బోధన్‌ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భా గంగా బోధన్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డీ మోహన్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసేందు కు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ము ఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్ర కాష్‌రెడ్డి, నాయకులు హాజరు కానున్నారు.

నవీపేట్‌ రైల్వేగేట్‌ మూడు

రోజులు మూసివేత

ఖలీల్‌వాడి : నవీపేట్‌ మండల కేంద్రంలోని రైల్వేగేట్‌ను ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మూసివేసినట్లు సీనియర్‌ రైల్వే సెక్షన్‌ ఇంజినీర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వేగేట్‌ వద్ద పనులు జరుగుతుండగా గేటు మూసినట్లు చెప్పారు. వాహనాదారులు దీని కి సహకరించాలని కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.

అమరవీరుల పార్క్‌లో

షబ్బీర్‌అలీ ప్రచారం

వాకర్స్‌తో ముచ్చట్లు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అర్బన్‌ నియోజకవర్గ అభ్యర్థి షబ్బీర్‌అలీ ఆదివారం వినాయకనగర్‌లోని అమరవీరుల పార్క్‌లో వాకర్స్‌తో ముచ్చటించారు. పార్క్‌లో కలియదిరుగుతూ వాకర్స్‌తో, సీనియర్‌ సిటిజన్స్‌తో మాట్లాడారు. తాను గెలిస్తే సంక్షేమం, అభివృద్ధి విషయంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అనంతరం అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ప్రచార కార్యక్రమంలో నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కేశ వేణు, రత్నాకర్‌ ఉన్నారు.

కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ

సుభాష్‌నగర్‌ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సమక్షంలో అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, చిత్రామిశ్రా, నగర పాలక సంస్థ కమిషనర్‌ మకరందు, కలెక్టరేట్‌ ఏవో ప్రశాంత్‌, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మహా పాదయాత్రికుడికి

ఘనస్వాగతం

2,800 కి.మీ పాదయాత్ర చేసిన ధాత్రిక రతన్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : కాశీ నుంచి శబరిమలై, శబరిమలై నుంచి రామేశ్వరం వరకు మొత్తం 2,800 కి.మీ మేర పాదయాత్ర పూర్తి చేసి మళ్లీ కాశీ విశ్వనాధుడి దర్శనం చేసుకుని ఇందూరుకు వచ్చిన.. హరిహర పుత్ర సేవాసమితి అధ్యక్షుడు, గురుస్వామి ధాత్రిక రతన్‌కు నగరంలో అయ్యప్ప ఆలయం వద్ద ఆదివారం ఘనస్వాగతం లభించింది. కాశీ నుంచి మరో నలుగురితో కలిసి పాదయాత్ర మొదలుపెట్టిన ధాత్రిక రతన్‌ ఇందూరుకు వచ్చాక మరో 26 మందితో కలిసి శబరిమలై వరకు పాదయాత్ర కొనసాగించారు. మళ్లీ అక్కడి నుంచి మరొక భక్తుడిని కలుపుకుని రామేశ్వరం వరకు పాదయాత్ర చేశారు. తిరిగి అక్కడి నుంచి రైలు ద్వారా కాశీ వెళ్లి విశ్వనాధుడి దర్శనం తర్వాత తాజాగా ఇందూరుకు తిరిగి వచ్చారు. రతన్‌కు వీహెచ్‌పీ, హిందూవాహిని, అయ్యప్ప దీక్షాపరులు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ ఠాకూర్‌, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు అనిల్‌ కదంజీ, నగర అధ్యక్షుడు ధాత్రిక రమేష్‌, సనాతన శ్రీకాంత్‌, రాంప్రసాద్‌ ఛటర్జీ, సురేష్‌గౌడ్‌, గజానన్‌, బబ్లు, మహేష్‌, ప్రణయ్‌, సదానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

1/2

2/2

Advertisement
Advertisement