ఉపాధి అవకాశాలు కల్పిస్తా | Sakshi
Sakshi News home page

ఉపాధి అవకాశాలు కల్పిస్తా

Published Mon, Nov 27 2023 12:44 AM

- - Sakshi

లక్కంపల్లి సెజ్‌, లెదర్‌ పార్క్‌లతో..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఆర్మూర్‌ నియోజకవర్గంలోని యువతకు స్థానికంగానే మంచి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు లక్కంపల్లి సెజ్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో పాటు ఇతర పరిశ్రమలను తీసుకొస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పొద్దుటూరి వినయ్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చూస్తానన్నారు. ఆదివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వినయ్‌రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు.

ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది?

బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రచారానికి వెళ్తే ఘనంగా స్వాగతిస్తున్నారు. నన్ను గెలిపించేందుకు యువకులు, మహిళలు ప్రచారానికి స్వచ్ఛందంగా తరలివస్తున్నారు.

మీ దృష్టికి వచ్చిన సమస్యలు..?

ఽనియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదు. ధరణి పోర్టల్‌ ద్వారా భూసంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నవారు తమ ఇబ్బందులను చెబుతున్నారు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు తాము అనుభవించిన వేదన గురించి వాపోతున్నారు. దళితబంధు, బీసీ బంధు పథకాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు 30 నుంచి 40 శాతం కమీషన్లు తీసుకున్న విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుల భూకబ్జాలు, అసైన్డ్‌ భూముల ఆక్రమణలు, ఇతర అరాచకాలపై చెబుతున్నారు. ఇక్కడి నాయకుడి పర్సంటేజీలు, కమీషన్ల కారణంగా లక్కంపల్లి సెజ్‌లోకి యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినవాళ్లు వెనక్కు వెళుతున్నారు. ఇక మట్టి, మొరం, భూదందా గురించి కథలుగా చెబుతున్నారు.

మీరిచ్చే హామీలు?

యువతకు ఉపాధి కల్పించేందుకు గతంలో కాంగ్రెస్‌ పార్టీ హయాంలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లక్కంపల్లి సెజ్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తా. లెదర్‌ పార్క్‌ను సైతం ఉద్యోగాలు కల్పించేలా అభివృద్ధి చేస్తా.

ఇక కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల ద్వారా అర్హులకు పథకాలు అందేలా చూస్తా. నందిపేటకు ఆర్టీసీ బస్‌ డిపో మంజూరు చేయిస్తా. మరోవైపు ఆర్మూర్‌ ఆర్టీసీ స్థలంలో మల్టీప్లెక్స్‌ బకాయిలు రూ.7.77కోట్లు, దీని విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.2.10కోట్లు రికవరీ చేయిస్తా. నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటా. స్థానిక ప్రజాప్రతినిధులకు మరింత ప్రాధాన్యత కల్పిస్తా.

నియోజకవర్గంలో శాంతియుత

వాతావరణం ఉండేలా చూస్తా

మల్టీప్లెక్స్‌ విద్యుత్‌,

లీజు బకాయిలు రికవరీ చేయిస్తా

స్థానిక ప్రజాప్రతినిధులకు

ప్రాధాన్యత కల్పిస్తా

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆర్మూర్‌

కాంగ్రెస్‌ అభ్యర్థి పొద్దుటూరి వినయ్‌రెడ్డి

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement