ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి | Sakshi
Sakshi News home page

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

Published Wed, Nov 15 2023 1:04 AM

- - Sakshi

డిచ్‌పల్లి: మండల కేంద్రంలో ఈ నెల 16న జరిగే సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి కోరారు. డిచ్‌పల్లి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు గజవాడ జైపాల్‌, దాసరి లక్ష్మీనర్సయ్య, శక్కరికొండకృష్ణ, సాయి లు, నర్సయ్య, నీరడిపద్మారావు, అంజయ్య, అమీర్‌, యూసుఫ్‌, అజహర్‌, శంకర్‌, రాథోడ్‌ సూదం, ప్రమోద్‌, నయీం, రామకృష్ణ, రవికి రణ్‌, పాషా,అంబర్‌సింగ్‌,గంగాదాస్‌ ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ విజయానికి

కృషి చేయాలి

సిరికొండ: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పార్టీ నాయకులు కోరారు. మండలంలోని తూంపల్లి గ్రామంలో మంగళవారం పార్టీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరిస్తు బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించేలా చూడాలని నాయకులు కోరారు. ఎంపీపీ సంగీత రాజేంధర్‌, జెడ్పీటీసీ మాన్‌సింగ్‌, వైస్‌ ఎంపీపీ రాజన్న, సర్పంచ్‌ బాలమణి మల్లేష్‌, మహేంధర్‌, గౌస్‌, సొసైటీ చైర్మన్‌ రాములు నాయక్‌, ఎంపీటీసీ లింగం ఉన్నారు.

ఘనంగా సహకార వారోత్సవాలు

సిరికొండ: మండల కేంద్రంలోని సహకార సంఘంలో మంగళవారం సహకార వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా సహకార జెండాను సీఈవో మహ్మద్‌ అలీ ఎగురవేశారు. సొసైటీ చైర్మన్‌ గంగారెడ్డి, తాళ్లరామడుగు సర్పంచ్‌ లక్ష్మీనర్సయ్య, మైలా రం ఎంపీటీసీ సతీష్‌, డైరెక్టర్లు గంగాధర్‌, లింగం, సిబ్బంది రాజారెడ్డి, భూపతిరెడ్డి, బాలరా జు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నాయకుల ప్రచారం

సిరికొండ: మండలంలోని గడ్కోల్‌ గ్రామంలో కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగు తు పార్టీ గ్యారంటీ పథకాలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భూపతిరెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. నాయకులు నవీన్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, భానుచందర్‌, మోహన్‌, అఖిల్‌, భాస్కర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

అధిక ఫీజుల వసూలు సరికాదు

నిజామాబాద్‌అర్బన్‌: డిగ్రీ కళాశాలలు విద్యా ర్థుల నుంచి అధికంగా పరీక్ష ఫీజులు వసూలు చేయడం సరికాదని, సంబంధిత కళాశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు అన్నారు. నగరంలోని ఏబీవీపీ కా ర్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

అప్పుల తెలంగాణగా మార్చారు

ఖలీల్‌వాడి: తెలంగాణ సంపాదనంతా ఇతర రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ ప్రచారం కోసం ఖర్చుపెట్టి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చార ని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్‌ అన్నారు. నగరంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బాజిరెడ్డి గెలవాలని పూజలు

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్‌ 1,11, 111 ఓట్ల మెజార్టీతో గెలుపొందాలని మండ లంలోని నర్సింగ్‌పల్లి ఇందూరు తిరుమలలో బహుజన నాయకులు మంగళవారం ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం మంచిప్ప గ్రామంలో బహుజనులతో సమావేశం ఏర్పాటు చేశా రు. నాయకులు నరాల సుధాకర్‌, మధుసూదన్‌, భోజరెడ్డి, ఒడ్డెన్న, సర్పంచ్‌ సిద్ధార్థ, ఉపసర్పంచ్‌ జగదీష్‌, అజీమ్‌, శ్రీనివాస్‌, సాయిరెడ్డి, మైసయ్య, నవీన్‌, సాగర్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఇంటింటి ప్రచారం

నిజామాబాద్‌నాగారం: నగరంలోని హమాల్‌వాడి, సుభాష్‌నగర్‌, పాముల బస్తీలో మంగళవారం బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్‌ కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకి ఓటు వేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గణేష్‌ బిగాలను గెలిపించాలని ప్రజలను కోరారు. మేయర్‌ నీతూకిరణ్‌, మాజీ మేయర్‌ ఆకుల సుజాత శ్రీశైలం, విశాలినిరెడ్డి, ఎర్రం గంగాధర్‌, బొబ్బిలి ముర ళి, నర్సింహ, కొండపాక రాజేష్‌ పాల్గొన్నారు.

1/2

2/2

 
Advertisement
 
Advertisement