బైండోవర్‌ అంటే ఏమిటి..? | - | Sakshi
Sakshi News home page

బైండోవర్‌ అంటే ఏమిటి..?

Nov 14 2023 12:54 AM | Updated on Nov 14 2023 12:54 AM

ఆర్మూర్‌: ఎన్నికల సమయం వచ్చిందంటే పోలీసులు పాత నేరస్తులను పీఎస్‌కు పిలిపించి తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేస్తుంటారు. ఇంతకు బైండోవర్‌ అంటే ఏమిటి.. దాన్ని ఎందుకు ఉపయోగిస్తారనే విషయం చాలా మందికి తెలియదు. బైండోవర్‌ అంటే ‘బాండ్‌ ఫర్‌ గుడ్‌ బిహేవియర్‌’గా పేర్కొంటారు. ఒక వ్యక్తి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తహసీల్దార్‌, ఆర్డీవో ఎదుట ప్రవేశ పెడతారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) 107, 108, 109, 110 సెక్షన్‌ల కింద బైండోవర్‌ చేస్తారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేస్తారు. చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టనని బాండ్‌ పేపర్‌పై లిఖిత పూర్వకంగా హామీని తీసుకుంటారు. అలాగే కొంత మొత్తానికి ష్యూరిటీ కూడా తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ ష్యూరిటీ మొత్తాన్ని అతడి నుంచి రికవరీ చేస్తారు. అంతే కాకుండా బైండోవర్‌ చేసిన వ్యక్తిపై అనుమానం వస్తే పోలీసులు 24 గంటల వరకు తమ అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పాత నేరస్తులను బైండోవర్‌ చేయడం ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement