ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి
భైంసాటౌన్: భైంసా ఏరియా ఆస్పత్రిలో రోగులకు అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ తెలిపారు. రూ.25 లక్షలతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వాషింగ్ మెషీన్‌ను సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిని మరింత ఆధునికీకరించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. భైంసాలో ప్రసూతి ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, ఇందుకు ఐదెకరాల స్థలం సేకరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ సురేశ్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, వైద్యులు అనిల్, విజయానంద్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.


