సొంతూళ్లకు వస్తున్నారు..
ఖానాపూర్: ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కార్మికులు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామాలకు తిరిగివస్తున్నారు. ఖానాపూర్ మండలం చింతల్‌పేట్, బీర్నంది, తదితర గ్రామాలకు చెందిన వలస కార్మికులు జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, ముంబై ప్రాంతాల వలస వెళ్తారు. వీరంతా ఇప్పుడు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రైళ్లు, బస్సుల్లో సొంతూళ్లకు చేరుకుంటున్నారు. గోసంపల్లెకి చెందిన బేడ బుడగజంగం కులానికి చెందిన సుమారు 100 మందికిపైగా గ్రామానికి వచ్చారు. ఈనెల 11న గ్రామంలో పోలింగ్ జరగనుంది. ఓటేసేందుకే వచ్చామని వారు తెలిపారు.


