నిర్భయంగా ఓటు వేయాలి
ముధోల్: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా సూచించారు. సోమవారం ముధోల్‌లోని ఐలమ్మ చౌరస్తా నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఫ్లాగ్‌మార్చ్ ప్రజల్లో నమ్మకం పెంచుతుందని, శాంతి భద్రతలు కాపాడుతుందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని సూచించారు. ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ముధోల్, బాసర సీఐలు మల్లేశ్, సాయి, ముధోల్ ఎస్సై బిట్ల పెర్సీస్, రెండో ఎస్సై గంగాధర్, లోకేశ్వరం, తానూర్ ఎస్సైలు అశోక్, నవనీత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


