జిల్లాస్థాయి బేస్, సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాస్థాయి అండర్–14, 17 బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ సబ్ జూనియర్స్ బాల, బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పోటీలను ప్రారంభించారు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి, సెక్రెటరీ అన్నపూర్ణ, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు అంబాజీ, భూమన్న, సత్తయ్య, సీనియర్ పీడీ శ్రీనివాస్, పీఈటీలు సాయిరాజ్, ముఖేష్, హనుమాండ్లు, సంజీవ్, గిరి తదితరులు పాల్గొన్నారు.


