నిర్మల్
8లోu
న్యూస్‌రీల్
అమ్మి 50 రోజులైనా జమకాని వైనం.. రైతు భరోసాపైనా ప్రకటన చేయని ప్రభుత్వం యాసంగి పెట్టుబడికి ఇబ్బంది పడుతున్న రైతులు
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్‌టౌన్: అర్జిదారుని నుంచి వచ్చిన సమస్యను పోలీస్ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
లక్ష్మణచాంద: ప్రభుత్వాలు మారుతున్నా.. రైతుల తలరాత మారడం లేదు. తమది రైతు ప్రభుత్వమని, రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూస్తామని చెప్పుకునే పాలకులు.. ఆచరణలో మాత్రం చూపడం లేదు. పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. డబ్బులు జమ చేయడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో ఽమొక్కజొన్న ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటి వరకు డబ్బులు అందలేదు.
30 వేల ఎకరాల్లో సాగు..
జిల్లాలో వానాకాలం 30 వేల ఎకరాల్లో రైతులు మొ క్కజొన్న సాగు చేశారు. ఇందులో కొందరు రైతులు ప్రైవేటు వ్యక్తులకు మొక్కజొన్న అమ్ముకోగా మిగిలిన రైతులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. మార్క్‌ఫెడ్ 2,700 రైతుల నుంచి 6,790 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. క్వింటాల్‌కు కేంద్రం రూ.2,400 మద్దతు ధర నిర్ణయించింది. ఈ లెక్కన జిల్లా రైతులకు రూ.16 కోట్లు అందాలి.
రెండు నెలలు గడిచినా..
మొక్కజొన్న ధాన్యం విక్రయించి రెండు నెలలు కావొస్తున్నా.. డబ్బులు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటల సాగు ప్రారంభించిన రైతులు.. డబ్బులు రాకపోవడంతో ప్రైవేటుగా అప్పులు చేస్తున్నారు. మరోవైపు యాసంగి పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసాపైనా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మక్కల డబ్బులు అయినా త్వరగా ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వివాహిత దారుణ హత్య..!
తనతో సన్నిహితంగా ఉంటూ మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతుందని ఓ యువకుడు వివాహితను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన భైంసాలో జరిగింది.
జిల్లా సమాచారం..
మొక్కజొన్న సాగు 30 వేల ఎకరాలు
పంట ప్రభుత్వానికి అమ్మిన రైతులు 2,700
మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించిన పంట
6,790 మెట్రిక్ టన్నులు
రైతులకు రావాల్సిన డబ్బులు
రూ.16 కోట్లు
విరక్రయానికి మార్కెట్‌కు తెచ్చిన మక్కల రాశులు(ఫైల్)
నిర్మల్
నిర్మల్


