అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
● ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్
బాసర: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆయన సాధనకు ప్రతీ పౌరుడు కృషి చేయాలని ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ అన్నారు. వర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఇన్‌చార్జి వీసీతోపాటు హెచ్‌వోడీలు, అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోవర్ధన్ మాట్లాడుతూ అంబేడ్కర్ బహుజను పక్షపాతి అన్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కృషి చేశారని తెలిపారు. ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ వర్ణ వివక్షతో బలహీనపడిన భారతీయ సమాజంలో అంబేడ్కర్ తీసుకొచ్చిన మార్పులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రేవల్లి అజయ్‌కుమార్, కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ బి.ఉపేందర్, అసోసియేట్ డీన్లు ఎస్.విఠల్, కె.మహేశ్, ఎస్.శేఖర్, డీఈఎస్ రాజేశ్వర్, అన్ని విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


