గెలిపిస్తే భూమి ఇస్తా..
ఖానాపూర్: తనను సర్పంచ్‌గా గెలిపిస్తే తన అత్త, మామల స్మారకర్థం గ్రామ అభివృద్ధికి రెండు గుంటల భూమిని ఇస్తానని ఖానాపూర్ మండలంలోని నూతన పంచాయతీ రంగపేట సర్పంచ్ అభ్యర్థి పురంశెట్టి హరితభూమేశ్ తెలిపారు. అనేక పోరాటాల ఫలితంగా గ్రామం పంచాయతీగా ఏర్పడిందని పేర్కొన్నారు. గ్రామంలో ప్రభుత్వ భవనాల కోసం సొంత స్థలాన్ని కేటాయిస్తానని వెల్లడించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తమ కుటుంబం పాల్గొందని, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో తమకు పోటీ చేసే అవకాశం వచ్చిందని వివరించారు. గ్రామస్తులు ఆదరించాలని కోరారు.


