నిర్మల్
న్యూస్‌రీల్
కొత్త గ్రామపంచాయతీలకు ఎన్ని‘కళ’ ఎవరు ఎన్నికై నా చరిత్రే..
అంబేడ్కర్ అందరివాడు
నిర్మల్‌చైన్‌గేట్: అంబేడ్కర్ అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేశారని, ఈమేరకు రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు అనుబంధ పల్లెలు, తండా వాసులుగా ఉన్న అక్కడి ప్రజలు ఇప్పుడు తమ పల్లెల్లో తమ రాజ్యం వచ్చిందని సంతోషపడుతున్నారు.
నాలుగు నూతన పంచాయతీలు..
జిల్లా వ్యాప్తంగా కొత్తగా న్యూధర్మాజీపేట, రంగపేట, కళ్యాణి, రంజని తాండల్లో తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. రెండేళ్ల క్రితం ఏర్పడ్డ జీపీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే మగ్గాయి. తమ గ్రామంలోని వ్యక్తినే సర్పంచ్‌గా ఎన్నుకునే అవకాశం వారికి ఈసారి దక్కుతుంది. స్వయంపాలన దిశగా ఈ గ్రామాలు అడుగులు వేయనున్నాయి.
ఎవరైనా మొదటి సర్పంచే..
నూతన గ్రామపంచాయతీలైన న్యూధర్మాజీపేట, రంగపేట, కళ్యాణి, రంజని తండాలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఆయా గ్రామాల వ్యక్తులే సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మొదటిసారి ఎన్నికలు కావడంతో యువత పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఎవరు గెలిచినా మొదటి సర్పంచ్‌గా చరిత్రలో నిలిచిపోతారు.
ఒకే నామినేషన్..
తానూరు మండలం జవ్లా(కే) గ్రామపంచాయతీ నుంచి కళ్యాణి గ్రామపంచాయతీ హోదా పొందింది. ఇక్కడ ప్రస్తుతం 900 జనాభా ఉంది. 633 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం సర్పంచ్, 8 వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే వేశారు. శుక్రవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం కానుంది.
రంగపేట గ్రామపంచాయతీ భవనం
ఖానాపూర్ మండలం రంగపేట ఇన్నాళ్లు బీర్నంది గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. ఇప్పుడు కొత్త గ్రామపంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామంలో దాదాపు 950 వరకు జనాభా ఉండగా, 573 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి వీరే తమ గ్రామానికి సంబంధించిన వ్యక్తినే సర్పంచ్‌గా ఎన్నుకోనున్నారు.
మండలం గ్రామపంచాయతీ జనాభా ఓటర్లు సర్పంచ్‌కు దాఖలైన
నామినేషన్లు
ఖానాపూర్ రంగపేట 900 573 5
కడెం న్యూధర్మాజీపేట 737 575 2
తానూర్ కళ్యాణి 653 445 1
కుభీర్ రంజనితండా 900 633 4
నిర్మల్
నిర్మల్
నిర్మల్


