ఆరట్టు వేడుక
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో శనివారం ఆరట్టు వేడుక ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ–మురళీధర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి జలాలతో గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప విగ్రహాలకు అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని పలు వీధులగుండా యాత్ర సాగింది. అయ్యప్ప దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. భక్తి పాటలకు అయ్యప్ప దీక్షాపరులు నృత్యాలు చేశారు.
ఆరట్టు వేడుక
ఆరట్టు వేడుక


