నిబంధనల ప్రకారం నామినేషన్లు స్వీకరించాలి
భైంసారూరల్: నిబంధన ప్రకారం నామినేషన్లు స్వీ కరించాలని భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా అన్నారు. మండలంలోని మిర్జాపూర్‌లో నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. ఎన్నికలు ముగిసే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
భైంసారూరల్ ఠాణా తనిఖీ...
అనంతరం భైంసారూరల్ పోలీస్ స్టేషన్‌ను రాజేశ్ మీనా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదవుతు న్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించాలని సూచించా రు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి సమస్యలు తెలుసుకోవాలన్నా రు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ సమయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశాంత వాతావరణంలో గ్రామాల్లో ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఏఎస్పీ వెంట సీఐ నైలు, ఎస్సై శంకర్ ఉన్నారు.


