జిల్లాస్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు
నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అండర్–14 బాలుర జిల్లాస్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఇందులో హషిర్ ఓవైస్, సిద్ధార్థ సంజయ్, స్వేదన్, ధ్రువన్, అభిజిత్, షేక్ గులాం, అర్హన్ ప్రతిభ కనబర్చి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. వీరు త్వరలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించే ఉమ్మడి ఆది లాబాద్ జట్టు ఎంపిక పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్ గౌడ్, వ్యాయమ ఉపాధ్యాయులు సత్తయ్య, సుమలత, చందుల స్వామి, వెంకటరమణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


