మొన్నటి ఉప సర్పంచులు.. నేడు సర్పంచ్ బరిలో
కడెం: మండలంలోని పలు గ్రామల్లో గత ఉప సర్పంచులే నేడు సర్పంచ్ బరిలో నిలిచారు. కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన ముడికె మల్లేశ్‌యాదవ్, కొండుకూర్ గ్రామానికి చెందిన మామిడిపెల్లి భీమేశ్, లింగాపూర్‌కు చెందిన కుమ్మరి రంజిత్, దస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన వర్ధెల్లి గోపాల్.. గత పాలకవర్గంలో ఉప సర్పంచులుగా ఉన్నారు. ప్రస్తుతం సర్పంచులుగా ఆయా గ్రామాల్లో నామినేషన్లు వేశారు. బరిలో నిలిచి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి వీరిలో సర్పంచ్‌గిరీ ఎవరిని వరిస్తుందో చూడాలి.


